జాతీయ వార్తలు

ఎన్నికల చట్టాలపై సమగ్ర సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజకీయాలను నేరరహితం చేయడంతో పాటు రాజకీయ పార్టీలకు అందే విరాళాలను ప్రక్షాళన చేయడానికి వీలుగా ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించిన ఎన్నికల సంఘం దేశంలోని ఎన్నికలకు సంబంధించిన అన్ని చట్టాలను సమగ్రంగా సమీక్షించే దిశగా సాగుతోంది. తాను పంపించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి స్పందనకోసం ఆతృతగా వేచిచూస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నసీం జైదీ శనివారం చెప్పారు. ధనబలం దుర్వినియోగం అయిన పక్షంలో సదరు ఎన్నికలను రద్దు చేసే అధికారాన్ని కూడా తనకు ఇవ్వాలని ఇసి ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇటీవల తమిళనాడులో రద్దయిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎలాంటి శిక్ష లేకుండానే తిరిగి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవాన్ని ఉదహరిస్తోంది. ఎన్నికల చట్టాలపై శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో జైదీ మాట్లాడుతూ ఇసికి చెందిన చట్టాల పరిశోధకులు.. చట్టాలకు సంబంధించిన నిపుణులు, సంస్థలతో కలిసి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరంపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ‘ఎన్నికల సంస్కరణలు అనేవి మరో ముఖ్యమైన అంశం. ఎన్నికల చట్టాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇసి పంపించిన 47 ప్రతిపాదనలతో కూడిన సంకలనాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రతిపాదనలను లా కమిషన్ పరిశీలించింది. వీటిలోని అనేక ప్రతిపాదనలను చట్టంగా చేయడానికి ఆమోదించింది’ అని అన్నారు. సంస్కరణలకు సంబంధించి ఇసి, లా కమిషన్ పంపించిన ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని టాస్క్ ఫోర్స్ పరిశీలించిందని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఆయన చెప్పారు.