జాతీయ వార్తలు

రెఫరెండం సరైనదే.. బ్రెగ్జిట్ విచారకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగాలా? లేదా? (బ్రెగ్జిట్) అనే అంశంపై రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించేందుకు గతంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ శనివారం సమర్ధించుకున్నారు. సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉన్న కీలక అంశాలపై ప్రజల అనుమతి తీసుకోకుండా పార్లమెంట్‌కు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిగా బ్రిటన్‌లో మూడుసార్లు ప్రజాభిప్రాయ సేకరణలను నిర్వహించిన కామెరాన్ న్యూఢిల్లీలో శనివారం ‘హిందుస్తాన్ టైమ్స్’ వార్తా సంస్థ నిర్వహించిన నాయకత్వ సదస్సు (లీడర్‌షిప్ సమ్మిట్)లో మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతున్నందుకు తాను చింతిస్తున్నప్పటికీ, ఇటువంటి కీలక నిర్ణయాలను తీసుకునే ముందు ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు రెఫరెండం న్విహించడాన్ని తాను ఇప్పటికీ సమర్ధిస్తున్నానని చెప్పారు. బ్రెగ్జిట్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో అనూహ్య ఫలితం రావడంతో కామెరాన్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పటికీ, స్కాట్లాండ్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలా, లేదా? అనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమర్ధించుకున్నారు. ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించి ఉంటే స్కాట్లాండ్ స్వాతంత్రోద్యమానికి మరింత బలం చేకూరి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ‘నేను నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలన్నీ పూర్తిగా సమర్ధనీయనవని భావిస్తున్నా. ప్రజాప్రతినిధులకు ఓట్లు వేస్తున్న ప్రజలే ఎన్నికల వ్యవస్థకు చోదకులు. ఆటలో కీలక నిబంధనలను నిర్ణయించేది వారే. వారి నుంచి అనుమతి పొందకుండా పార్లమెంటులో ఈ నిబంధనలను మారిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక ఇటువంటి విషయాల్లో పార్లమెంట్‌కు అతీతంగా వ్యవహరించి ప్రజల వద్దకు వెళ్లడమే శ్రేయస్కరం’ అని కామెరాన్ అన్నారు.