జాతీయ వార్తలు

అమృత్‌సర్-అఫ్గాన్ మధ్య సుదీర్ఘ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 4: అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సు అమృత్‌సర్ నగరంలో జరుగుతున్న సందర్భంగా ఆదివారం ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌తో ఈ పురాతన నగరానికి ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేశారు. అఫ్గానిస్థాన్‌తో అమృత్‌సర్‌కు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని, తరచూ యుద్ధాల కారణంగా ఛిన్నాభినమైన అఫ్గానిస్తాన్ సమగ్రాభివృద్ధి, సుస్థిరత, ఆర్థికాభివృద్ధికి ఆ దేశంతో కనెక్టివిటీని పునరుద్ధరించుకోవడం ఎంత ముఖ్యమైనదో ఈ నగరం గుర్తు చేస్తోందని అన్నారు. నగర వాసుల దేశభక్తి, దాతృత్వం ఈ నగర స్వరూపస్వభావాలను తీర్చిదిద్దాయని ఆయన గుర్తుచేస్తూ అఫ్గానిస్థాన్‌తో ఈ నగరానికి దీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సిక్కుల తొలి గురువయిన గురునానక్ దేవ్ ప్రథమ శిష్యుల్లో అఫ్గాన్ దేశస్థులు కూడా ఉన్నారని, 15వ శతాబ్దంలో ఆయన కాబూల్‌లో సిక్కు మత ప్రచారం చేశారని మోదీ చెప్పారు. ఇప్పుడు కూడా పంజాబ్‌లోని అఫ్గాన్ దేశానికి చెందిన సూఫీ సన్యాసి బాబా హజరత్ షేక్ దర్గాను ప్రతిఏటా అఫ్గాన్‌నుంచి వందలాది భక్తులు సందర్శిస్తూ ఉంటారని, వారేకాకుండా అన్ని మతాల వారు పెద్ద సంఖ్యలో ఈ దర్గాకు వస్తుంటారని ఆయన అన్నారు. అమృత్‌సర్ నగర ప్రజలు కష్టించి పని చేయడానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే వారని ఆయన అన్నారు. మోదీ తన ప్రసంగాన్ని ‘నమస్కార్, సత్‌శ్రీ అకాల్’ అంటూ సంప్రదాయ సిక్కు గ్రీటింగ్స్‌తో ప్రారంభించారు. అమృత్‌సర్ నగరం భారత్-పాక్ సరిహద్దులకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో కలిసి ఇక్కడి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు కూడా.

చిత్రం..స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన అషఫ్ ఘనీ, ప్రధాన నరేంద్ర మోదీ