జాతీయ వార్తలు

ఘనంగా గడ్కరీ కుమార్తె వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, డిసెంబర్ 4: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గడ్కరీ చిన్న కుమార్తె అయిన కెట్కి వివాహం అమెరికాలో ఫేస్‌బుక్ కంపెనీలో పనిచేస్తున్న ఆదిత్య కాష్కేడికర్‌తో జరిగింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ , అస్సాం గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, శివసేన అధినేత ఉద్భవ్ థాకరే, ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్‌థాకరే హాజరయ్యారు. కేంద్ర మంత్రులు మనేకాగాంధీ, ప్రకాష్ జావదేకర్, హన్సరాజ్ అహిర్, పీయుష్ గోయల్, యోగా గురు బాబా రాందేవ్, ఎన్‌సిపి సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్, మహారాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

చిత్రం..నాగపూర్‌లో ఆదివారం జరిగిన కేంద్ర మంత్రి గడ్కరీ కుమార్తె వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదిస్తున్న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్