జాతీయ వార్తలు

సుస్థిర శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 4: ప్రధాని నరేంద్ర మోదీ, అప్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఆదివారం ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, యుద్ధంతో ఛిన్నాభిన్నమైన అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపడుతున్న పునర్నిర్మాణ కార్యకలాపాలు, రక్షణ, భద్రత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మార్గాలులాంటి కీలక అంశాలపై ప్రధానంగా ఈ చర్చలు జరిగాయి. ప్రధానంగా పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్థాన్ మీదుగా విమానాల ద్వారా సరకు రవాణాకు వీలు కల్పించే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అంశం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ భూభాగం గుండా సరకు రవాణా విమానాలు వెళ్లడానికి పాకిస్తాన్ అభ్యంతరాలు చెప్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందం భారత్‌కు ఎంతో ప్రయోజనకారి అవుతుంది. అఫ్గానిస్థాన్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడంలో భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఘనీకి హామీ ఇచ్చారు. భారత్‌నుంచి మిలిటరీ హార్డ్‌వేర్ సరఫరాలను మరింతగా పెంచాలని ఈ చర్చల సందర్భంగా ఘనీ కోరినట్లు చెప్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం అఫ్గాన్‌నుంచి నాటో బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత మరింత బలం పుంజుకున్న తాలిబన్లతో పోరాటం జరపడానికి తన సాయుధ బలగాలను మరింతగా బలోపేతం చేయడానికి అప్గానిస్థాన్ ప్రయత్నిస్తూ ఉన్న విషయం తెలిసిందే.
ఎయిర్ కార్గో ఒప్పందానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇప్పటికే ఖరారయినందున వీలయినంత త్వరగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్, అఫ్గాన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవడానికి వివిధ కనెక్టివిటీ ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌లోని చాబహార్‌ను ఒక ట్రాన్సిట్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వాణిజ్య, రవాణా కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి గత మేలో భారత్, ఇరాన్, అఫ్గానిస్థాన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని గ్వాడార్ రేవును చైనా అభివృద్ధి చేస్తున్న దృష్ట్యా, దానికి ప్రతిగా చాబహార్ పోర్టు అభివృద్ధిపై భారత్ ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌తో సన్నిహిత రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడం పాకిస్తాన్‌కు ఆగ్రహం తెప్పించినప్పటికీ ఈ సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవాలని ఘనీ భావిస్తున్నారు. గత వారం మన దేశం అప్గానిస్తాన్‌కు నాలుగు మిలిటరీ హెలికాప్టర్లను ఇచ్చింది. వందలాది మంది అఫ్గాన్ సైనికులకు మన దేశం శిక్షణ ఇస్తోంది కూడా. అయితే, ఆయుధాలను ఇచ్చే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. అప్గానిస్థాన్‌లో వౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి సంబంధించి భారత్ దాదాపు 200 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేస్తోంది.

చిత్రం..అప్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీతో కరచాలనం చేస్తున్న ప్రధాని మోదీ