జాతీయ వార్తలు

7న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 4: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7న పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) సోమవారం డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన షార్‌లో జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆధరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆదివారం ఉపగ్రహం చుట్టూ ఉష్ణ కవచం అమర్చే ప్రక్రియను సైతం పూర్తిచేశారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ 31 గంటల ముందు 6వ తేదీ తెల్లవారుజామున 3:24 గంటలకు ప్రారంభం కానుంది.