జాతీయ వార్తలు

ఇక కొత్తగా రూ.20, 50 నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: త్వరలోనే కొత్తగా రూ.20, రూ.50 నోట్లను ప్రవేశపెడుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. రూ.500, రూ.1000 నోట్లను హఠాత్తుగా రద్దు చేసిన నెలరోజుల తరువాత ఆర్బీఐ తాజా ప్రకటన చేసింది. ఏటి ఎంల వద్ద నెల రోజులుగా కొనసాగుతున్న క్యూలు, నోట్ల రద్దుపై రాజకీయంగా రేగిన దుమారం సామాన్యుడికి చిల్లర కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటన కాస్తంత ఊరట కలిగించేదే. కొత్తగా వచ్చే ఈ రెండు నోట్లలో చిన్న చిన్న మార్పులు ఉంటాయని బ్యాంకు పేర్కొంది. డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లు పాత నోట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ రూ.20నోటు ప్యానెల్‌లో ఇన్‌సెట్ లెటర్ ‘జ’ ఉంటుందని, రూ.50 నోటు ప్యానెల్‌లో ఇన్‌సెట్ లెటర్ ఉండదని వివరించింది.