జాతీయ వార్తలు

నిందలు వేయటం తేలికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 4: దక్షిణాసియాలో అశాంతి, ఉగ్రవాదానికి సంబంధించి ఒక దేశంపై నిందలు వేయటం చాలా తేలికని పాకిస్తాన్ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. అమృత్‌సర్‌లో ముగిసిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ప్రధాని మోదీ పాకిస్తాన్‌ను పరోక్షంగా తెగనాడిన నేపథ్యంలో అజీజ్ ఎదురుదాడి చేశారు. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న అజీజ్ అఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాద ఘటనలకు తమపై ఆరోపణలు చేయటం సరికాదని స్పష్టం చేశారు. ‘‘ ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలపై మా వైఖరి సుస్పష్టం. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఈ టెర్రరిజాన్ని తక్షణం ఎదుర్కోవలసి ఉంది. కలసికట్టుగా ప్రయత్నిస్తే తప్ప దీనికి పరిష్కారం సాధ్యం కాదు. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న పరిస్థితి చాలా సంక్లిష్టమైంది. ఒక దేశాన్ని నిందించటం చాలా తేలికే. కానీ మనం ఈ అంశాన్ని విశాలమైన, బాధ్యతాయుతమైన దృక్పథంతో వ్యవహరించాలి.’’ అని అజీజ్ అన్నారు. టెర్రరిస్టులను, వారిని పెంచి పోషిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో అజీజ్ పాకిస్తాన్ పక్షాన సమాధానం చెప్పుకొచ్చారు. ‘‘్భరత్ పాక్‌ల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ఉత్కంఠ ఉన్నప్పటికీ నేను ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రధాన కారణం ఆఫ్గనిస్తాన్‌తో పాటు దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని స్పష్టం చేయటం కోసమే’’ అని అజీజ్ వ్యాఖ్యానించారు. ఆసియా ప్రాంత అభివృద్ధికి రాజకీయ సుస్థిరత, ఆర్థిక సహకారం అత్యవసరమని అజీజ్ అన్నారు. ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వానికి, తాలిబాన్‌ల మధ్య శాంతి చర్చలు ఫలించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నదన్నారు. అజీజ్ తన ప్రసంగంలో జమ్ముకాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం.