జాతీయ వార్తలు

అనిశ్చితికి అవకాశమే లేదు: వైగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినందున రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు తలెత్తవచ్చంటూ వస్తున్న వార్తలను అర్థం లేనివిగా ఎండిఎంకె నాయకుడు వైగో ఖండించారు. అలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్న వారు పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. ‘అస్థిరత లేనే లేదు. అలాంటి పరిస్థితి తలెత్తనే తలెత్తదు. కొంతమంది గాలిలో మేడలు కడుతూ ఉండవచ్చు. వాళ్లు పిచ్చోళ్ల లోకంలో ఉన్నారనిపిస్తోంది. అనిశ్చితి నెలకొంటుందని, దాన్ని తమకు అనుకూలంగా మలచుకొంటామని ఎవరైనా అనుకొంటే వారిని చూస్తే నాకు జాలేస్తుంది’ అని జయలలిత ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం సోమవారం అపోలో ఆస్పత్రికి వచ్చిన వైకో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. పార్టీ రాజకీయాలే కాకుండా జయలలితతో తనకు దీర్ఘకాలంగా ఉన్న అనుబంధాన్ని వైకో గుర్తు చేసుకుంటూ, జయతో తనకు వ్యక్తిగత చనువు ఉందని, ఆమెను తాను సోదరిగా పరిగణిస్తానని, ఆమె కూడా తనను సోదరుడిగా చూస్తారని చెప్పారు. ఇంతకు ముందు కూడా జయలలిత అనారోగ్యంనుంచి కోలుకున్నారని ఆయన అంటూ, ఇప్పుడు సైతం ఆమె ఈ పరిస్థితినుంచి బైటపడుతారన్న నమ్మకం తను ఉందని అన్నారు.