జాతీయ వార్తలు

74 రోజులుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సంఘటనల క్రమం ఇది.
2016 సెప్టెంబర్ 22: జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిక
సెప్టెంబర్ 24: జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన. ఆమె త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ
సెప్టెంబర్ 25: జయలలితను చికిత్స కోసం విదేశాలకు తరలిస్తున్నట్టు వ్యాపించిన వదంతులు. ఖండించిన అపోలో ఆసుపత్రి వర్గాలు
సెప్టెంబర్ 29: జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని ప్రకటించిన అపోలో వైద్యులు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యుల సూచన
అక్టోబర్ 1: జయలలిత ఆరోగ్యంపై వ్యాపించిన వదంతులకు అన్నా డిఎంకె వర్గాలు, ఆసుపత్రి యాజమాన్యం ఖండన. ఆమె ఆసుపత్రి నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వెల్లడి
అక్టోబర్ 2: లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే ఆధ్వర్యంలో చికిత్స. యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నట్టు ప్రకటించిన ఆసుపత్రి
అక్టోబర్ 6: చెన్నైకి చేరుకున్న ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రత్యేక వైద్య బృందం
అక్టోబర్ 21: జయలలిత కోలుకుంటున్నట్టు వైద్యుల వెల్లడి
నవంబర్ 3: జయ పూర్తిగా కోలుకున్నారని, తన చుట్టూ ఏం జరుగుతోందో అర్థం చేసుకుంటున్నారని వెల్లడి
నవంబర్ 13: తనకు పునర్జన్మ లభించిందని లేఖపై సంతకం చేసిన జయలలిత. అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వేచి ఉన్నట్లు వెల్లడి
నవంబర్ 19: అత్యవసర చికిత్స విభాగం నుంచి ప్రైవేటు గదికి జయలలిత తరలింపు. వెంటిలేటర్ లేకుండా ఆమె శ్వాస తీసుకుంటున్నట్టు వైద్యుల వెల్లడి
నవంబర్ 25: అమ్మ స్పీకర్ సాయంతో మాట్లాడినట్టు ఎఐఎడిఎంకె వర్గాల వెల్లడి. పూర్తిగా కోలుకున్నారని ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని వెల్లడి
డిసెంబర్ 4: సాయంత్రం 6 గంటలకు జయలలితకు గుండెపోటు. తిరిగి అత్యవసర చికిత్స విభాగానికి తరలించిన వైద్యులు
డిసెంబర్ 5: మధ్యాహ్నం 12.30 గంటలకు జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని అపోలో వైద్యుల ప్రకటన
జయ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే వెల్లడి