జాతీయ వార్తలు

‘అమ్మ’బ్రాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 6: ‘అమ్మ’ బ్రాండ్‌తో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రకటించిన ఉచిత తాయిలాలు, పథకాలు ఆమెకే ప్రత్యేకమైనవిగా నిలవడమే కాకుండా, ప్రధాన ప్రత్యర్థి అయిన కరుణానిధి నేతృత్వంలోని డిఎంకెను చిత్తు చేయడానికి తోడ్పడ్డాయని చెప్పవచ్చు. అమ్మ క్యాంటీన్లు, అమ్మ జిమ్నాసియంలు, పార్కులు.. ఒకటేమిటి, ప్రతిదానికీ ‘అమ్మ’ పేరు ఉండడం సర్వసాధారణమైపోయింది. తమిళనాడులో ఉచిత తాయిలాలకు అద్యుడు కరుణానిధి కావచ్చు కానీ, జయలలిత తన రాజకీయ చతురతతో వాటికి కొత్త అర్థం తీసుకువచ్చారని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె తమిళనాడు ఓటర్లను ముఖ్యంగా కింది స్థాయి ఓటర్లను దృష్టిలో పెట్టుకుని రకరకాల ఉచిత తాయిలాలను ప్రకటించారు. 2006లో కరుణానిధి ఉచిత కలర్ టీవీలను ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టిస్తే ఆ తర్వాత జయలలిత 2011, 2016 ఎన్నికల్లో మరో అడుగు ముందుకేసి రకరకాల పథకాలను ప్రకటించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయ నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రకటించిన ఉచిత బియ్యం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, పాడి ఆవులు, మేకలు, మిక్సీలు, గ్రైండర్లు, పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఉచిత ‘తాళి బొట్లు’ లాంటి హామీలు డిఎంకెను మూడో స్థానానికి నెట్టి వేయడమే కాకుండా అన్నా డిఎంకె మిత్రపక్షమైన డిఎండికెను ప్రధాన ప్రతిపక్షం స్థానంలో నిలబెట్టాయి. 2016 ఎన్నికల్లో జయ మరో అడుగుముందుకేసి, పేదల ఇళ్లకు వంద యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, ఉచిత మొబైల్ ఫోన్లు, ద్విచక్రవాహనాలను కొనుగోలు చేయడానికి మహిళలకు 50 శాతం సబ్సిడీ లాంటి మరిన్ని పథకాలను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జయ పార్టీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఏ అధికార పార్టీ కూడా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేని 32ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలికేలా చేసింది.

2011లో ప్రారంభించిన సంక్షేమ పథకం కింద లబ్ధిదారులకు మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు పంపిణీ చేస్తున్న అప్పటిముఖ్యమంత్రి జయలలిత (ఫైల్ ఫొటో)
2013లో రూపాయకే అల్పాహారం (ఇడ్లీ-సాంబారు), ఐదు రూపాయలకు మధ్యాహ్న భోజనం (పులిహోర/ పెరుగన్నం, / సాంబారన్నం) పథకాన్ని ప్రారంభిస్తున్న జయలలిత (ఫైల్ ఫొటో)