జాతీయ వార్తలు

పలు రాష్ట్రాల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీలు ఘనంగా నివాళులర్పించగా, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఒక రోజు సంతాప దినాలను ప్రకటించాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించడమే కాకుండా ఆమెకు గౌరవసూచకంగా పది నిమిషాలపాటు వాయిదాపడింది. అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్, రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ మల్లయ, తాత్కాలిక ప్రతిపక్ష నేత బాలబచ్చన్, బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేత సత్యప్రకాశ్ సక్వార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జయలలిత గుణగణాలను ప్రశంసించారు. మధ్యాహ్న భోజన పథకం జయలలిత ఆలోచనే అని, తొలిసారిగా ఆమే తమిళనాడులో దీన్ని ప్రవేశపెట్టారని వారు అన్నారు. జయలలిత మృతి దేశానికి తీరని లోటని వక్తలు అన్నారు. అనంతరం సభ దివంగత నేతకు నివాళిగా రెండు నిమిషాలు వౌనం పాటించిన అనంతరం పది నిమిషాల పాటు వాయిదాపడింది.
మహారాష్ట్ర అసెంబ్లీ సైతం జయలలితకు ఘనంగా నివాళి అర్పించింది. అనంతరం ఆమెకు గౌరవసూచకంగా ఈ రోజు సభను వాయిదా వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ నాయకుడు పతంగ్‌రావు కదమ్, ఎన్‌ఎస్‌పికి చెందిన అజిత్ పవార్, పిడబ్ల్యుపికి చెందిన గణపత్‌రావు దేశ్‌ముఖ్, రాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు జయకు ఘనంగా నివాళులర్పించారు. సంతాప తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభ వాయిదాపడింది.
కాగా, జయలలిత మృతికి సంతాప సూచకంగా పొరుగు రాష్ట్రాలయిన కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఒక రోజు సంతాప దినాన్ని పాటించాయి. రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలు, విద్యా సంస్థలతో పాటుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినయారి విజయన్, గవర్నర్ పి సదాశివంలు జయలలితను అసాధారణమైన రాజకీయవేత్తగా, పరిపాలనాదక్షురాలిగా అభివర్ణిస్తూ, ఆమె మృతితో గత మూడు దశాబ్దాలుగా కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రత్యేకమైన మాతృత్వపు మమత అంతరించి పోయిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితల పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడుకు ఆనుకుని ఉన్న జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా జయకు నివాళిగా మంగళవారం సంతాపదినంగా ప్రకటించింది. తమిళనాడు రాజకీయాల్లో గొప్ప నాయకుల్లో జయ ఒకరని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ, ఆమె మృతితో దేశ రాజకీయాల్లో పూడ్చలేని లోటు ఏర్పడిందన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా తమిళ రాజకీయాల్లో సైతం గొప్ప వ్యక్తుల్లో ఒకరుగా ఆమె ఎదిగారని, జయ మృతితో ఇప్పుడు అందంతా చరిత్రగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. కాగా, దేశ రాజకీయ చరిత్రలో జయకు జీవితానికి సాటిరాగల నాయకులు మరొకరు లేరని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప అన్నారు.

చిత్రం..జయలలిత మృతికి సంతాప సూచకంగా ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో జాతీయ పతాకాన్ని అవనతం చేసిన దృశ్యం