జాతీయ వార్తలు

డిసెంబర్ మాసం.. దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 6: తమిళనాడు రాష్ట్రానికి డిసెంబర్ ఒక దురదృష్ట మాసంగా పరిణమించిందని జయలలితకు నివాళి అర్పించటానికి వచ్చినవాళ్లు చర్చించుకున్నారు. బహుళ ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎంజి రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న చనిపోయారు. అంతే ప్రజాదరణ పొందిన జయలలిత కూడా డిసెంబర్‌లోనే (సోమవారం) కన్నుమూశారు. ఇద్దరు నేతలూ చాలాకాలంపాటు అనారోగ్యంతో బాధపడ్డారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు కూడా డిసెంబర్‌లోనే తమిళనాడును కబళించాయి. 2004 డిసెంబర్ 26న సునామీ తమిళనాడును ఛిన్నాభిన్నం చేసింది. 2015 డిసెంబర్‌లో కుండపోతగా రోజుల తరబడి కురిసిన వాన చెన్నైతో పాటు కాంచీపురం, కడలూరు, తిరువల్లూరు, తూత్తుక్కుడిలలో ప్రజల్లో భయాందోళనలను సృష్టించింది.