జాతీయ వార్తలు

మందుపాతర్లతో మావోల విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 6: పిఎల్‌జిఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలపై మందుపాతర్లతో విరుచుకుపడ్డారు. దంతెవాడ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా, నారాయణ్‌పూర్ జిల్లాలో మాత్రం పోలీసులు ఎదురుదాడి చేయడంతో అడవుల్లోకి పారిపోయారు. ఉదయం దంతెవాడ జిల్లా అరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండపార-కొండాసవలి మధ్య రహదారి నిర్మాణానికి సిఆర్‌పిఎఫ్ 231 బెటాలియన్‌కు చెందిన జవాన్లు పహారా కాయడానికి వెళ్లారు. పహారాకు జవాన్లు వస్తారని ముందుగానే ఊహించిన మావోయిస్టులు సోమవారం రాత్రే మందుపాతరను అమర్చారు. ఉదయం రోడ్డు నిర్మాణ ప్రదేశానికి జవాన్లు రాగానే మాటు వేసిన నక్సల్స్ మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ కమల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హెలీకాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్తున్న సిఆర్‌పిఎఫ్, ఎస్టీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ మందుపాతర పేల్చారు. అయితే బలగాలు దాటాక అది పేలడంతో తప్పించుకున్న జవాన్లు వెంటనే తేరుకుని నక్సల్స్‌పై ఎదురుదాడికి దిగారు. నక్సల్స్ సమీప అడవుల్లోకి పారిపోయారు.

చిత్రం.. హెడ్‌కానిస్టేబుల్ కమల్ మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం