జాతీయ వార్తలు

రిసోర్స్ శాట్‌లో కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఉపగ్రహాల ప్రయాణానికి సంబంధించి మరింత కచ్చితంగా సమాచారం సేకరించేందుకు కొత్త ప్రయోగం చేసింది. బుధవారం ప్రయోగించిన రిసోర్స్ శాట్ 2ఏ ఉపగ్రహంపై రెండు కెమెరాలు ఉంచారు. శాటిలైట్ ప్రయోగ సమయంలో మోటార్లు, ఉపగ్రహాలు, వేడి శకలాలు విడిపోవటంపై మరింత కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇస్రో చరిత్రలో ఇలాంటి ఏర్పాటు ఇదే మొదటిసారి. రాకెట్‌కు ఉపరితలంపై ఏర్పాటు చేసిన కెమెరాతో ఉపగ్రహం విడిపోవటం, నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత సోలార్ ప్యానల్ విచ్చుకోవటం వంటి ప్రక్రియలను శాస్తవ్రేత్తలు, ప్రజలు స్పష్టంగా చూసేందుకు వీలవుతుంది. రెండో కెమెరాతో రాకెట్‌ను ప్రయోగించిన వెంటనే స్ట్రాప్ ఆన్ మోటర్లు, వేడి శకలాలు విడిపోవటాన్ని స్పష్టంగా చూడవచ్చని ఇస్రో తన వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. ‘రిసోర్స్‌శాట్‌లో రాకెట్‌పై భాగంలో రెండు కెమెరాలను అమర్చాము. ఉపగ్రహం ప్రయోగించినప్పటి నుంచి కక్ష్యలో చేరేంతవరకు మొత్తం ప్రస్థానాన్ని ఈ కెమెరాలు రికార్డు చేశాయి’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఇస్రో అధికారి తెలిపారు. ఈ కెమెరాల వల్ల స్పష్టమైన ఫుటేజి అందుతుంది. అంతకుముందు లాంచ్‌పాడ్‌ల నుంచి ప్రయోగం జరిగే దశ వరకే స్పష్టంగా చూడటం సాధ్యమయ్యేది. ఆ తరువాత అంతా ఆన్‌స్క్రీన్ మ్యాప్‌లపై మాత్రమే చూడగలిగేవాళ్లం. ఇప్పుడు ఈ కెమెరాల అమరికతో ఉపగ్రహం కక్ష్యలో చేరేంత వరకూ కూడా మనం స్పష్టంగా వీడియో చూడవచ్చు.