జాతీయ వార్తలు

రైల్వే స్టేషన్లు, బస్సుల్లో పాత 500నోటు చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలోని రైల్వే స్టేషన్లు, బస్సులు, మెట్రో స్టేషన్లలో పాత 500నోట్లు ఇక చెల్లవు. 10వ తేదీ తరువాత పాత 500 రూపాయల నోట్లను తీసుకోరని ప్రభుత్వం వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇంతకు ముందు రైల్వే కౌంటర్లు, ప్రభుత్వం రంగ బస్సు టికెట్లకు డిసెంబర్ 15 వరకూ అనుమతిస్తారని తెలిపారు. ఇప్పుడు దాన్ని డిసెంబర్ 10వరకు కుదించారు. అయతే ఈ నెల 3 నుంచే పాత 500 రూపాయల నోట్లను కొన్నిచోట్ల స్వీకరించడం మానేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలుకు పాత నోట్లను తీసుకోవడం మానేశారు. కేంద్రం ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తరువాత యుటిలిటీ బిల్లులు చెల్లింపునకు 72 గంటల వరకూ గడువు ఇచ్చారు. ఈ డెల్‌లైన్‌ను మూడుసార్లు పొడిగించారు. ఆ గడువు నవంబర్ 24తో ముగిసింది. తరువాత పాత 500 రూపాయల నోట్లను విద్యుత్, వాటర్, స్కూలు ఫీజులు, ప్రీపెయిడ్ మొబైల్ టాప్‌అప్, ఇంధనం కొనుగోలు, విమాన టికెట్ల బుకింగ్‌కు అనుమతించారు.