జాతీయ వార్తలు

తక్షణమే గద్దె దిగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 8: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ తీసుకున్న చర్య ‘ఆర్థిక వ్యవస్థ విధ్వంసాని’కి దారితీసినందున ఆయన తక్షణమే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల ఉపసంహరణ వల్ల దేశ అభివృద్ధి, వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎవరినీ నమ్మరని, దేశానికి ఏది మంచో ఆయన అర్థం చేసుకోలేరని ఆమె విమర్శించారు. ‘టీమ్ వర్క్ లేదు. నిపుణులను సంప్రదించలేదు. ఇది ఏక వ్యక్తి నియంతృత్వం. ఇది ఒక వ్యక్తి చేసిన విధ్వంసం. ఇది వినాశకరమైన ధోరణి’ అని మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. ‘తప్పు చేసిన తరువాత ఆయన ఛాతి విరుస్తున్నారు. భుజాలు ఎగురవేస్తున్నారు. ఏమిటిది? అలాంటి ఆకారం సినిమాలలో అవసరం. రావణుడికి కూడా విశాలమైన ఛాతీ ఉంది’ అని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తానే ప్రధానమంత్రిని అయి ఉంటే, ఇలాంటి చర్య తీసుకున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పేదానినని, తన లోపాన్ని సరిచేసుకునేదానినని అన్నారు. ‘మోదీ గద్దె దిగి తీరాలి. కొనసాగే నైతిక హక్కుకు అతనికి లేదు’ అని మమత నిర్ద్వంద్వంగా చెప్పారు. ‘ప్రస్తుత ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాడితప్పిందని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. రేపు, ఎల్లుండి ఏం సంభవిస్తుందో ఆయన చెప్పడం లేదు. ఆయన వివరణ ఇచ్చి తీరాలి’ అని మమత అన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాను చేస్తున్న ప్రచారాన్ని మోదీకి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆమె అభివర్ణించారు. నోట్లను ఎందుకు రద్దు చేశారో ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రధాని, ఆయన సహచరులు లబ్ధి పొందారని ఆమె ఆరోపించారు. ప్రధాని నల్ల ధనాన్ని రక్షిస్తున్నారని కూడా ఆరోపించారు.