జాతీయ వార్తలు

కన్నీటి సాగరమైన మెరీనా బీచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 8: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జయను సమాధిచేసిన మేరినాబీచ్ ప్రాంతం కన్నీటిసాగరమైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి దివంగత నాయకురాలికి నివాళులర్పిస్తున్నారు. అమ్మ చనిపోయి గురువారానికి మూడు రోజులైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వౌన ప్రదర్శనలు జరిగాయి. ప్రియతమ నాయకురాలిని అంజలి ఘటించేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివస్తుండడంతో ఏర్పాట్లు పర్యవేక్షించడానికి నగర పోలీసు కమిషనర్ ఎస్ జార్జి మెరీనాబీచ్‌కు వచ్చారు. అమ్మ సమాధి వద్దకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోయెస్ గార్డెన్‌లోని జయ నివాసాన్ని అభిమానులు సందర్శిస్తున్నారు. కాగా కన్యాకుమారి బీచ్‌లో తొమ్మిది టన్నుల ఇసుకతో జయలలిత సైకత శిల్పం ఏర్పాటుచేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి, మదురై, కొయంబత్తూర్ తదితర నగరాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో వౌన ప్రదర్శలు జరిగాయి. మహిళలు వేలాదిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చిత్రాలు..జయలలితకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గురువారం మదురైలో వౌన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఎఐఎడిఎంకె కార్యకర్తలు.
కన్యాకుమారి రేవులో తొమ్మిది టన్నుల ఇసుకతో ఏర్పాటు చేసిన జయలలిత సైకత శిల్పం