జాతీయ వార్తలు

మమ్మల్నీ మాట్లాడనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రతిపక్షం చేసిన గొడవ, గందరగోళం మూలంగా గురువారం కూడా రాజ్యసభ సక్రమంగా పని చేయలేదు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ వాదన వినిపించేందుకు అవకాశం లభించడం లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బాధ ఎవరు వింటారు అంటూ సమాచార శాఖ మంత్రి వెం.వెంకయ్యనాయుడు రాజ్యసభలో వాపోయారు. జీరో అవర్‌లో సభాధ్యక్షుడు హమీద్ అన్సారీతో ఈ అంశంపై వాదనకు దిగారు. ప్రతిపక్షం ప్రతిరోజు జీరో అవర్‌లో పెద్దనోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది. కాని ప్రభుత్వం తమ వాదన వినిపించేందుకు ప్రయత్నించగానే నినాదాలతో అల్లరిచేసి సభ వాయిదా పడేలా చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు. ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ జీరో అవర్‌లో మాట్లాడటంపట్ల తనకు అభ్యంతరం లేదు, అయితే ఆయన మాట్లాడిన అనంతరం ప్రభుత్వానికి తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుఖేందురాయ్ లేచి బ్యాంకుల వద్ద నోట్లకోసం క్యూలో నిలబడినవారు ఇంతవరకు వందమంది మరణించారని ఆరోపించారు. దీనికి వెంకయ్య నాయుడు స్పందిస్తూ ఈ అంశంపై వెంటనే చర్చ ప్రారంభించాలి తప్ప ఇలా జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని వాదించారు. దీనికి హమీద్ అన్సారీ స్పందిస్తూ మంత్రులు కూడా గొడవ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నియమావళి గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన తరువాత అవకాశం ఇస్తానని హమీద్ అన్సారీ బదులిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు, సభా నాయకుడు మాట్లాడాలనుకుంటే అవకాశం ఇవ్వటం సభ సంప్రదాయం కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తున్నానని హమీద్ అన్సారీ స్పష్టం చేశారు.
గులాం నబీ ఆజాద్ ఆరోపణ
పెద్దనోట్ల రద్దు మూలంగా వందకు పైగా ప్రజలు మరణించారని ఆజాద్ ఆరోపించారు. నోట్లకోసం మరణించిన వారికి శ్రద్దాంజలి ఘటించలేదు కాబట్టే వందకుపైగా ఎంపీలు పదహారు పార్టీల నాయకులు ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహంవద్ద శ్రద్దాంజలి ఘటించామని చెప్పారు. ప్రజలవద్ద ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు డబ్బు లేదన్నారు. దేశంలోని పేదప్రజల గాయాలపై ఉప్పు చల్లుతున్నందుకు మీరు సిగ్గుపడాలి, సిగ్గు లేనితనానికి కూడా ఒక హద్దుంటుంది అంటూ గులాం నబీ ఆజాద్ దుయ్యబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షం పెద్దఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు కూడా రాజ్యసభలో ప్రతిరోజు మాదిరిగానే గొడవ జరిగింది. ప్రతిపక్షం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. హమీద్ అన్సారీ పెద్దనోట్లపై తదుపరి చర్చ ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను శుక్రవారం ఉదయం వరకు వాయిదా వేశారు.

చిత్రం..రాజ్యసభలో మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు