జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై బూటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై శనివారం ఒక వ్యక్తి బూటు విసిరాడు, వాహనాలకు సరి-బేసి పథకం అమలుకు సంబంధించి సచివాలయంలో కేజ్రీవాల్ విలేఖరులతో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన ఆమ్‌ఆద్మీ సేనకు చెందిన వేద ప్రకాశ్ అనే వ్యక్తి సిఎంపై బూటు విసిరాడు. సిఎన్‌జి పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా కేజ్రీవాల్ చర్యలు తీసుకోలేదని అతడు ఆరోపించాడు. సిఎం పట్టించుకోనందుకే తానీ పనిచేయాల్సి వచ్చిందని చెప్పాడు. బూటు కేజ్రీవాల్ పక్కనుంచే దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ నెల 15 నుంచి రెండో విడత సరి-బేసి పథకం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలోకూడా ఒకసారి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతుండగా సిరా విసిరారు. శనివారం కేజ్రీవాల్‌పై బూటు విసిరిన వ్యక్తికి ఇరవై ఏడేళ్లు ఉంటాయని, సంఘటన తరువాత సిఎం యథావిధిగా విలేఖరుల సమావేశం కొనసాగించారని అధికారులు పేర్కొన్నారు.