జాతీయ వార్తలు

ఎందుకంత గోప్యత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 9: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్యచికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంత గోప్యతను ఎందుకు పాటించిందని తమిళ నటి గౌతమి తడిమల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను చూడటానికి ఎవరినీ ఎందుకు అనుమతించలేదని గౌతమి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రశ్నించారు. 68 ఏళ్ల జయలలిత గుండెపోటు కారణంగా ఈ నెల 5న ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయలలిత సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న వాతావరణం వల్ల జయలలిత అస్తమయం ఒక విషాదాంతంగా పరిణమించిందని, దివంగత ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందటం, కోలుకున్నట్టు వచ్చిన వార్తలు, ఆకస్మికంగా కన్నుమూయడంపై అనేక సమాధానాలు లేని ప్రశ్నలు ఉద్భవించాయని 48 ఏళ్ల గౌతమి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమాచారం లేదని, ఎంతో విచారంతో ఆసుపత్రిని సందర్శించిన అనేక మంది ప్రముఖులు జయలలితను కలిసి ఆమె త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షలను నేరుగా వ్యక్తం చేయకుండా అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఎందుకు ఇంత గోప్యతను పాటించారని, ప్రియతమ ప్రజానాయకురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు ఎవరిని కలవకుండా ఒంటరిని చేశారని ఆమె ప్రధానిని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రిని ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించిన అధికారులు ఎవరని గౌతమి ప్రశ్నించారు. జయలలితకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఇవి తమిళనాడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలని, వారి గొంతుకగా తాను వీటిని మీ దృష్టికి తీసుకొస్తున్నానని గౌతమి ప్రధానిని ఉద్దేశించి రాశారు.