జాతీయ వార్తలు

పంజాబ్‌లో ఘెర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫజిల్కా (పంజాబ్), డిసెంబర్ 9: పంజాబ్‌లో శుక్రవారం దట్టమైన పొగమంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొనడంతో 13మంది ఉపాధ్యాయులు సహా 14 మంది దుర్మరణం చెందారు. ఫజిల్కా- జలాలాబాద్ రోడ్‌లో చాంద్‌మేరి టోల్ ప్లాజా సమీపంలో ఉపాధ్యాయులను పాఠశాలకు తీసుకెళ్తున్న వాహనం ఒక ట్రక్కును ఢీకొంది. దట్టమైన పొగమంచు కారణంగా సరిగా కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయులు వెళ్తున్న వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి, తరువాత మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మృతి చెందిన ఉపాధ్యాయులలో అయిదుగురు మహిళలు ఉన్నారు. వీరంతా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు. వీరిలో ఎనిమిది మంది ఫజిల్కాకు చెందిన వారు కాగా, మిగతా అయిదుగురు అబోహర్‌కు చెందిన వారని పోలీసులు వివరించారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక ఉపాధ్యాయుడిని ఫరీద్‌కోట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదానికి గురయిన వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ప్రయాణించారు. ఈ ఘోర ప్రమాదం తనను తీవ్రంగా బాధించిందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రత్యేకించి 13మంది ఉపాధ్యాయులను కోల్పోవడం రాష్ట్రానికి పెద్ద లోటని ఆయన అభివర్ణించారు. ఉపాధ్యాయుడు మన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఆర్కిటెక్ట్‌యే కాకుండా నిజమైన మార్గదర్శి అని, తత్వవేత్త అని ఆయన అన్నారు. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా సహకరించాలని, తీవ్రంగా గాయపడిన ఒక ఉపాధ్యాయుడికి ఉత్తమ వైద్య చికిత్సను అందించాలని అధికారులను సిఎం ఆదేశించారు.
పంజాబ్ డిప్యూటి సిఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గుర్‌ప్రీత్ సింగ్ ఘుగ్గి మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు కమ్ముకుంటున్నందున రానున్న రోజుల్లో వాహనాలు నడిపేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సుఖ్‌బీర్ సింగ్ సూచించారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకొని ఉంటున్నందున పాఠశాలల వేళలను మార్చాలని అమరీందర్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

చిత్రం..పంజాబ్‌లోని ఫజిల్‌క జిల్లాలోని ఫిరోజ్‌పూర్‌లో
శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన స్కూలు వ్యాను