జాతీయ వార్తలు

నేను మాట్లాడితే భూకంపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై లోక్‌సభలో తనను మాట్లాడనీయడం లేదని, తాను మాట్లాడితే భూకంపమే వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆయన అంటూ, ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేమిటో అన్ని విషయాలను తాను లోక్‌సభలోనే వెల్లడిస్తానని శుక్రవారం లోక్‌సభ వాయిదాపడిన అనంతరం పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ అంశంపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. నోట్ల రద్దుపై సభలో మాట్లడడానికి తనకు అవకాశమొచ్చినప్పుడు ప్రధాని సభలో కూర్చోను కూడా లేరని రాహుల్ అన్నారు. ప్రధాని దేశమంతా తిరిగి మాట్లాడుతారు కానీ లోక్‌సభకు రారు, సభలో కూర్చోవడానికి కూడా ఇష్టపడరని ఆయన అంటూ,ఈ భయానికి కారణమేమిటి? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ జరగాలనే తమ పార్టీ కోరుకుంటోందని, దీనిపై చర్చించడం కోసమే తాము దాదాపు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నామని, అయితే ప్రభుత్వమే చర్చనుంచి పారిపోతోందని ఆయన అన్నారు. ప్రధాని లోక్‌సభకు వస్తే నోట్ల రద్దు వెనుక అసలు కారణం ఏమిటి, దీనివల్ల ఎవరు లబ్ధి పొందారు, దీనివల్ల బడాబాబులకు ఏం జరుగుతోంది, బడుగువర్గాలు ఎలాంటి కష్టాలు పడుతున్నాయి అన్నీ చర్చించవచ్చని అన్నారు. ఈ విషయంపై తాను లోక్‌సభలో అన్నీ చెప్తానని కూడా రాహుల్ అన్నారు. ‘పార్లమెంటులో నేను మాట్లాడడానికి అధికార పక్షం అనుమతిస్తే భూకంపమే వస్తుంది’ అని ఆయన అన్నారు.

చిత్రం.. ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ