జాతీయ వార్తలు

ఎవరూ లేనప్పుడొస్తే బాగుండును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 9: నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో స్పందించారు. తాను పార్లమెంటులో మాట్లాడితే భూకంపమే వస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలపై వెంకయ్య స్పందిస్తూ, ఆ భూకంపమేదో పార్లమెంటులో తాము ఎవరూ లేనప్పుడు వస్తే బాగుంటుందని అన్నారు. ‘2జి, 3జి, బొగ్గు కుంభకోణం, కామనె్వల్త్ క్రీడల కుంభకోణం.. ఒకటా.. రెండా.. యుపిఏ హయాంలో జరిగిన కుంభకోణాలకు లెక్కే లేదు. తప్పుచేసిన వాళ్లపై ఎలాంటి చర్యా తీసుకోకుండా వౌనంగా ఉండడం తెలివైన పనా?’ అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. నోట్ల రద్దు తెలివితక్కువ నిర్ణయమయితే, మీరు తెలివైన వారయితే ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్లమెంటును సాఫీగా జరగడానికి అనుమతించాలి. చర్చ జరగనివ్వాలి. అంతే తప్ప పార్లమెంటులోపల గొంతు విప్పకుండా పార్లమెంటు బయట మాట్లాడడం ఏమిటని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ‘మీరు ఈ దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్నారు’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ‘మీరు దేన్ని తెలివితక్కువ నిర్ణయమని అంటున్నారు? నల్లధనం, అవినీతిపై చర్య తీసుకోవడం తెలివితక్కువ పనా? లేక కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన వారితో కుమ్మక్కు కావడమా? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని ఆయన కాంగ్రెస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు.ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్‌లు ఆత్మవిమర్శ చేసుకుని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మిగిలిన రోజులు సజావుగా సాగనివ్వాలని, ఎందుకంటే ముఖ్యమైన బిల్లులను ఆమోదించాల్సి ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. కాగా, రాహుల్ గాంధీ మాట్లాడితే భూకంపం వచ్చేది పార్లమెంటులో కాదు, కాంగ్రెస్ పార్టీలోనేనని బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. పార్లమెంటు రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తుందే తప్ప రాహుల్ గాంధీ అభిమతం ప్రకారం నడవదని కూడా ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

చిత్రం..కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు