జాతీయ వార్తలు

మహిళ కాబట్టి ఎవరెస్టు ఎక్కవద్దంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల నిషేధం సతీ, వరకట్న వేధింపుల కంటే దారుణం.
పిటిషనర్ వాదన
పురుష, మహిళా
క్రికెట్‌లో వేర్వేరు నిబంధనలున్నట్లే.. ఆలయాల్లోనూ ఉంటాయ.
శబరిమల పూజారి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆలయాల్లో మహిళలను ప్రవేశించవద్దనడం వంటి నిబంధనల వల్ల దేశంలో స్ర్తిపురుష సమానత్వం అనేది అత్యంత ప్రమాదంలో పడిందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. సంప్రదాయం, ఆచారాల పేరుతో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న ఆలయాల్లో ఆ నిబంధన తొలగింపునకు డిమాండ్‌లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి రజస్వల అయిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, పినాకి చంద్రఘోష్, ఎన్.వి.రమణతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏ సంప్రదాయమైనా రాజ్యాంగం కన్నా ఉన్నతమైనదా అని అయ్యప్ప దేవాలయ ట్రస్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదిని నిలదీసింది. కేవలం మహిళ అయినంత మాత్రాన ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కకూడదని నిషేధం విధించగలరా? అని ప్రశ్నించింది. ఆలయ ఆవరణలో దేవుడిని ప్రార్థించకుండా మహిళలను అడ్డుకునే హక్కు ఆలయ ట్రస్టుకు ఎక్కడిదని నిలదీసింది. ఈ అంశంపై రాజ్యాంగ సూత్రాల పరిధిలోనే వాదించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చినా, అది ఈ దేశ చట్టాలకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కును, మతస్వేచ్ఛ హక్కును సమతుల్యం చేస్తానని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే రజస్వల వయసులో ఉన్న మహిళలు పరిశుభ్రంగా ఉండరు కాబట్టే ఆలయంలోనికి అనుమతించటం లేదని అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి మనవడు రాహుల్ ఈశ్వర్ అన్నారు. మహిళల పట్ల వివక్ష చూపుతున్నారన్న వాదనలను ఆయన ఖండించారు. క్రికెట్ ఆటలో మహిళల ఆటకు, పురుషుల ఆటకు వేర్వేరు నిబంధనలు ఉన్నట్లే ఆలయాల్లో కూడా ఉంటాయని ఆయన అన్నారు. అయితే మహిళలకు ఆలయ ప్రవేశంపై నిషేధం విధించటం సతీసహగమనం, వరకట్నం కంటే దారుణమైన దురాచారమని పిటిషనర్ వాదించారు.
సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యలు కొన్ని
- దేశంలో స్ర్తిపురుష సమానత్వం ప్రమాదంలో పడింది
- భారత దేశంలో తొలుత తల్లిని ముందుగా పూజిస్తాం.. అలాంటి తల్లి స్థానంలో ఉండే మహిళకు దేవుణ్ణి అర్చించుకునే అవకాశం లేదా?
- ఎవరైనా దేవుడిని పూజించవచ్చు. అతడు సర్వాంతర్యామి
- మసీదుల్లోకి పురుషులతో పాటు మహిళలను ప్రార్థనల కోసం ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారా? లేక వేరే గదిలో విడిగా ప్రార్థనలు చేసుకోనిస్తున్నారా?
- మీరు దేవుణ్ణి విగ్రహంగా మార్చారు.. ఆ విగ్రహాన్ని అర్చించటానికి మహిళలను రావద్దని మీరెలా అంటారు?