జాతీయ వార్తలు

నల్ల కుబేరులకే ముచ్చెమటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోలన్(హిమాచల్‌ప్రదేశ్), డిసెంబర్ 11: హిమాచల్ ప్రదేశ్‌కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను ఓడించటం ద్వారా అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రహిత భారత దేశ ఆవిష్కరణకు హిమాచల్ ప్రదేశ్ అధికారం నుంచి ఆ పార్టీ ని ఓడించటమే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విజయ రథం హిమాచల్ ప్రదేశ్‌కు కూడా చేరుకుంటుందని అమిత్‌షా అన్నారు. ఇక్కడ బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారం మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. హిమాచల్ ప్రదేశ్‌లో అవినీతికి వీరభద్రసింగ్ ప్రభుత్వం గతం లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపిఏ ఈ జాడ్యాన్ని పెంపొందించిందని అమిత్‌షా దుయ్యబట్టారు. నల్లధనాన్ని పోగేసుకున్న వారే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై హాహాకారాలు చేస్తున్నారని అమిత్‌షా అన్నారు. ఈ నిర్ణయంపై సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి ఒక్కరు మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తూ వస్తున్నారని తెలిపారు. నల్లధనంపై నడిచే సమాంతర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయటానికి ఉద్దేశించిన నిర్ణయంగా పెద్దనోట్ల రద్దును పేర్కొన్నారు. ఈ చారిత్రక నిర్ణయం వల్ల ఉగ్రవాదులకు నిధులు ఆగిపోతాయని, నక్సల్స్ దోపిడీ కూడా తగ్గుతుందని, నకిలీ కరెన్సీ ముఠాలను కూడా అణచివేయవచ్చని అమిత్‌షా తెలిపారు. 50రోజుల పాటు ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందంటూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువరించినప్పుడే ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగు వారాల వ్యవధిలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నల్లధనంలో 25శాతం మొత్తాన్ని పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు. దాదాపు రూ.12లక్షల కోట్ల అవినీతి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా కేంద్రం లో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ హయాంలో ఒక్క అవినీతి కుంభకోణం కూడా జరగలేదని స్పష్టం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకునే తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలిగే ప్రధానమంత్రి ఇప్పుడు భారతదేశానికి లభించారని అమిత్‌షా అన్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఇక్కడి ప్రభుత్వం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించినప్పుడే కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతాయన్నారు.