జాతీయ వార్తలు

కోహినూర్ వజ్రం జయలలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 11: పురుషాధిక్య సమాజంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని తనదైన శైలిలో రాణించిన కోహినూర్ వజ్రంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను సూపర్ స్టార్ రజనీకాంత్ అభివర్ణించారు. సుదీర్ఘ అస్వస్థత అనంతరం ఇటీవల మరణించిన జయలలిత, చో రామాస్వామిలకు నివాళులర్పించేందుకు ఆదివారం దక్షిణ భారత కళాకారుల సంఘం సంస్మరణ కార్యక్రమం నిర్వహించింది. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను చేసిన కొన్ని ప్రకటనలు జయలలితకు తీవ్ర మనస్తాపం కలిగించాయని రజనీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయం వల్లే జయ సారథ్యంలోని అన్నాడిఎంకె ఓడిపోయిందన్నారు. 3అన్నాడిఎంకెను మళ్లీ ఎన్నుకుంటే ఆ దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు2అని తాను అన్నట్టుగా రజని తెలిపారు. అయితే తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన జయలలిత తన సత్తాను చాటుకన్నారన్నారు. ఎమ్‌జి రామచంద్రన్ తర్వాత రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్నారన్నారు. జీవితంలో ఎదురైన సవాళ్లే జయలలితలో పట్టుదలను పెంచాయని, రెండో ఏటే తండ్రిని, 20 తర్వాత తల్లిని కోల్పోయిన జయలలిత సొంత కుటుంబమంటూ లేకుండానే పురుషాధిక్య సమాజంలో రాణించారని..కృషి, పట్టుదలతోనే తిరుగులేని స్థాయికి చేరుకున్నారని తెలిపారు. తన చిరకాల మిత్రుడు చో రామస్వామికి నివాళులర్పించిన రజనీ ఆయన గొప్పతననాన్ని విశే్లషించారు.