జాతీయ వార్తలు

బుర్హాన్ వనీ సోదరుడి కుటుంబానికి పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 13: కాశ్మీర్ లోయలో ఉగ్రవాద సంబంధిత సంఘటనల్లో భద్రతా దళాల చేతిలో చనిపోయిన 17 మంది కుటుంబాలకు తలా 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 17 మందిలో ఈ ఏడాది జూలైలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ సోదరుడు ఖాలిద్ వనీ కూడా ఉన్నాడు. ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ఏవయినా అభ్యంతరాలుంటే దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల గడువు ఇచ్చింది. ఉగ్రవాద సంబంధిత సంఘటనల్లో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి జిల్లాస్థాయి స్క్రీనింగ్, సంప్రదింపుల కమిటీ ఆమోదం తెలియజేసిందని పుల్వామా డిప్యూటీ కమిషనర్ సోమవారం జారీ చేసిన ఒక నోటిఫికేషన్ పేర్కొంది. జాబితాలోని 17 మందిలో బుర్హాన్ వనీ సోదరుడు ఖాలిద్ ముజఫర్ వనీ పేరు కూడా ఉంది. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్ వనీ మృతి చెందడంతో కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన వియం తెలిసిందే. 25 ఏళ్ల ఖాలిద్ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీనుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.