జాతీయ వార్తలు

అసోం, బెంగాల్‌లో భారీగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/కోల్‌కతా, ఏప్రిల్ 11: అసోం, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అసోంలో 79 శాతం మంది, పశ్చిమ బెంగాల్‌లో 75 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల సందర్భంగా అక్కడక్కడా ఘర్షణలు, పోలీసు కాల్పులు చోటుచేసుకోవడంతో ఒక వృద్ధ ఓటరు మృతిచెందాడు. అసోంలో సోమవారం రెండో విడతగా 61 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే బార్పేట జిల్లా సోర్భోగ్ సెగ్మెంట్‌లోని పోలీసు స్టేషన్ వద్ద క్యూ ఏర్పాటు విషయమై స్థానికులకు, సిఆర్‌పిఎఫ్ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో 80 ఏళ్ల ఓటరు మృతిచెందగా, సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, కానిస్టేబుల్ సహా ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అలాగే కామరూప్ జిల్లా చాయిగావ్‌లో గర్భవతి పట్ల సిఆర్‌పిఎఫ్ జవాను దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులు నిరసనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఓటువేసి పిల్లవాడిని మర్చిపోయి వెళ్లిన సదరు మహిళ తన బాలుడి కోసం మళ్లీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గొడవ జరిగింది. ఆ పోలింగ్ బూత్ వద్ద మోహరించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల బృందాన్ని అక్కడి నుంచి మార్చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత సైకియా వెల్లడించారు.
దిస్పూర్‌లో మన్మోహన్ సింగ్ ఓటు
అసోంలో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు. 1991 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఆయన గౌహతి చేరుకుని దిస్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత శాసనసభ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన 31 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 75 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

చిత్రం అసోంలోని దిస్పూర్ నియోజకవర్గంలో ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్