జాతీయ వార్తలు

హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, స్టేట్ హైవేలపై ఉండే అన్ని మద్యం దుకాణాలను మూసేయాలని సుప్రీంకోర్టు గురువారం అన్ని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 31తో ఇప్పుడున్న షాపుల లైసెన్సుల గడువు ముగిసిన తర్వాత వాటిని పొడిగించవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలన్నర మంది ప్రాణాలు కోల్పోవడంపై గత వారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జాతీయ రహదారులు, స్టేట్ హైవేలపై మద్యం దుకాణాలను మూసివేయాలని, అలాగే మద్యం దుకాణాలు ఉండే చోటులను తెలిపే సైన్‌బోర్డులను తొలగించాలని తాము ఆదేశించే అవకాశముందని వ్యాఖ్యానించడం తెలిసిందే. హైవేలపై మద్యం విక్రయాలు జరక్కుండా చూడడానికి ఇప్పుడున్న ఎక్సైజ్ చట్టాలను సవరించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై గత 7వ తేదీన తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన బెంచ్, మినహాయింపులు ఇవ్వాలని కోరిన పంజాబ్ రాష్ట్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది కూడా. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం దుకాణాలను అనుమతించాలని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు తమ ఆదేశాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కూడా తీర్పులో స్పష్టం చేసింది. తాగి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం జరుగుతున్నాయని.. అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్య దుకాణాలను ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకొన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.