జాతీయ వార్తలు

ఆటంబాంబు దాడి కంటే భయానకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, డిసెంబర్ 16:నగదు రద్దును ఆటం బాంబు కంటే హేయమైన చర్యగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ‘ఫైర్ బాంబింగ్’గా పేర్కొన్న రాహుల్ దీని వల్ల 99శాతం నిజాయితీ పరులు దెబ్బతిన్నారని, మొత్తం భారత దేశమే నాశనమైందని అన్నారు. కాంగ్రెస్‌కు దేశం కంటే పార్టీయే ముఖ్యమంటూ ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో శుక్రవారం పనాజీలో మాట్లాడిన రాహుల్ ‘నవంబర్ 8న ఉన్నపళంగా లేచిన మోదీ మీ జేబులో ఉన్న డబ్బు ఇక చిత్తుకాగితమే అన్నారు. ఈ నిర్ణయం నల్లధనంపై లక్షిత దాడి కాదు. మొత్తం 99శాతం భారతీయులపై జరిగిన ఫైర్ బాంబింగ్’అని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 200-300 విమానాలు ఫైర్ బాంబింగ్‌కు పాల్పడి కేవలం 25నిముషాల్లోనే అనేక పట్టణాలను భస్మీపటలం చేశాయని గుర్తు చేసిన రాహుల్ దీని ప్రభావం ఆటంబాంబు దాడి కంటే భయంకరమైనదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలపై ఈ రకమైన దాడికే పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆర్థిక మంత్రి సహా ఎవరితోనూ మోదీ మాట్లాడ లేదని అన్నారు.

చిత్రం..ఉభయ సభల నిరవధిక వాయదా అనంతరం లోక్‌సభనుంచి బయటికి వస్తున్న రాహుల్ గాంధీ