జాతీయ వార్తలు

మీరే రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల గత కొన్ని వారాలుగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ సారథ్యంలోని పలు ప్రతిపక్ష పార్టీల బృందం శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి వివరించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో రాష్టప్రతిని కలిసిన ఈ బృందం అసలు ఉభయ సభలు సాగకుండా అధికార పార్టీ విపక్షాల గొంతు నొక్కిందని ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జెడి, జెడియు తదితర పార్టీలకు చెందిన నాయకులు రాష్టప్రతిని కలుసుకున్నారు. అయితే ఎన్‌సిపి, డిఎంకె, వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పిలు మాత్రం ఈ బృందంతో చేతులు కలపలేదు. నిన్న మొన్నటివరకు అనేక అంశాలపై ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దుపై ముక్తకంఠంతోనే ముందుకెళ్లిన విపక్షాల్లో ఈ చీలిక రావడానికి కాంగ్రెస్ బృందం విడిగా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడమేనని చెబుతున్నారు. పార్లమెంటు హౌస్‌లో మోదీని కలిసి కాంగ్రెస్ బృందం రైతులకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.
దీంతో రాష్టప్రతిని కలుసుకునే కాంగ్రెస్ బృందంలో తాము చేరమని వామపక్షాలు సహా పలు పార్టీలు స్పష్టం చేశాయి. కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సారథ్యంలో రాష్టప్రతిని కలిసిన ఈ బృందం ఆయనకు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య హక్కులను హరించేదిగా ఉందని, పార్లమెంటులో తమ గళాన్ని ఎంతమాత్రం వినిపించే అవకాశం లేకుండా చేస్తోందని ఆ విజ్ఞాపన పత్రంలో పేర్కొంది. ఇలాంటి పరిణామాల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనను కూడా వ్యక్తం చేసింది. ఉన్నఫళంగా పెద్దనోట్లను రద్దుచేయడం వల్ల దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితి తలెత్తిందని, రాజ్యాంగ పరిరక్షకుడిగా ఈ ఆర్థిక విపత్తునుంచి ప్రజలను రక్షించాలని రాష్టప్రతిని ఈ బృందం అభ్యర్థించింది. పెద్ద నోట్లను రద్దుచేయడం వల్ల గత కొన్ని వారాలుగా దేశంలో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయో తాము రాష్టప్రతికి వివరించామని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రైతులు, చిన్నవ్యాపారులు సహా అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని తాము కోరినట్లు రాష్టప్రతికి తెలిపామన్నారు. పార్లమెంటులో ఈ అంశాలపై చర్చకు తాము ఎంతగా ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిందని, తమ ప్రయత్నాలను అడ్డుకుందని ఖర్గే అన్నారు. పార్లమెంటును సజావుగా నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రులే ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటుకు వచ్చి సభా వ్యవహారాలనే ముందుకు సాగకుండా చేశారని ఖర్గే అన్నారు.

చిత్రం..పార్లమెంట్ ఉభయ సభలూ నిరవధిక వాయదా అనంతరం పెద్దనోట్ల రద్దుతో
ప్రజలు పడుతున్న అవస్థలను రాష్టప్రతిభవన్‌లో రాష్టప్రతి
ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తున్న కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఎంపీలు