జాతీయ వార్తలు

ఆద్యంతం గందరగోళమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 16: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరా,హోరీగా రాజకీయం చేయటంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. నవంబర్ 16న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయ సభలు మొత్తం ఇరవై ఒక్క రోజులు కొనసాగాయి. అధికార, ప్రతిపక్షం సభ్యులు అవలంబించిన ప్రతికూల విధానాల మూలంగా దేశాన్ని అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చ జరగలేదు. చర్చకు తాము ఎల్లప్పుడు సిద్ధనేనని ఇరుపక్షాలు ప్రకటించినా ఏ ఒక్క రోజు చర్చకు ఆస్కారం ఏర్పడలేదు. రాజ్యసభ మొదటి రోజు పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగగా మిగతా రోజుల్లో ఒక రోజు మినహా మిగతా రోజుల్లో ఉభయ సభలు అధికార, ప్రతిపక్షం సభ్యుల గొడవ, గందరగోళం మూలంగా పూర్తిగా కొట్టుకుపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన అవగాహన మేరకు దిగ్యాంగుల సవరణ బిల్లు 2014ను స్వల్ప చర్చ అనంతరం ఉభయ సభలు ఆమోదించాయి. ఈ ఒక్క బిల్లు ఆమోదం మినహా మిగతా రోజులన్నీ గొడవ, గందరగోళానికి బలైపోయాయి. పెద్ద నోట్ల రద్దు మూలంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ ఎలా జరపాలనే అంశంపై అధికార, ప్రతిపక్షం సభ్యులు హోరా,హోరీగా పోరాటం చేశారు.
సభలు సజావుగా జరగకుండా అడ్డుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు పోటీ పడి మరీ గొడవ చేశాయి. దేవుడి కోసమైనా సభలను కొనసాగనివ్వాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ విజ్ఞప్తి చేయవలసి వచ్చిందంటే ఉభయ సభల్లో ఏ స్థాయిలో గొడవ, గందరగోళం చోటుచేసుకున్నాయో ఊహించుకోవచ్చు. ప్రతిపక్షం ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలని పట్టుపట్టటంతో లోకసభ సమావేశాలు గొడవ, గందరగోళానికి బలైపోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు రావటంతోపాటు తాము ప్రస్తావించే అన్ని అంశాలకు స్వయంగా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం పట్టుపట్టటంతో రాజ్యసభ సమావేశాలూ ఏ మాత్రం జరుగలేదు.
ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి సృష్టించిన గందరగోళం మూలంగా లోకసభ దద్దరిల్లిపోయింది. ప్రధాన మంత్రి సభకు రావాలి, తమకు క్షమాపణలు చెప్పాలంటు రాజ్యసభలో ప్రతిపక్షం చేసిన గొడవ మూలంగా గందరగోళం నెలకొన్నది. నరేంద్ర మోదీ మధ్య,మధ్యలో లోక్‌సభ, రాజ్యసభకు హాజరయ్యారు. అయితే ఆయన సభకు వచ్చిన రోజు కూడా ప్రతిపక్షం వివిధ కారణాలతో సభను కొనసాగనివ్వలేదు. ప్రతిపక్షం మొదటి పదమూడు రోజులు ఉభయ సభలను వివిధ కారణాలతో అడ్డుకుంటే ఆ తరువాత అధికార పక్షం సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఫలితంగా పెద్దనోట్ల రద్దుపై చర్చకు ఆస్కారమే ఏర్పడలేదు. మామూలుగా అయితే ప్రతిపక్షం సభ్యులు చేసే గొడవ మూలంగా ఉభయ సభలు వాయిదా పడతాయి. అయితే ఈసారి అధికార పక్షం కూడా గొడవ ద్వారా ఉభయ సభలను స్తంభింపజేయటం గమనార్హం. మొదట రెండు వారాల పాటు సభను స్తంభింపజేసిన కాంగ్రెస్ ఆ తరువాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించేందుకు చర్చకు పట్టుపట్టింది. రాహుల్ గాంధీ ప్రసంగం లోక్‌సభలో రికార్డు అయిన తరువాత సభను మళ్లీ యథావిధిగా స్తంభింపజేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. దీనిని పసిగట్టిన అధికార పక్షం ఆఖరు మూడు రోజులు సభ కొనసాగకుండా అడ్డుపడటం శీతాకాల సమావేశాల ప్రత్యేకత. శీతాకాల సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా జరగలేదు. ప్రతిపక్షం పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టిస్తే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ గందరగోళం మధ్యనే కొద్ది సేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభలో కూడా ఇదే తంతు కొనసాగింది. ప్రతిపక్షం ప్రతి రోజు వాయిదా తీర్మానం ఇవ్వటం స్పీకర్ సుమిత్రా మహాజన్ వాటిని ప్రతి రోజు తిరస్కరించటం ఆనవాయితీగా మారింది. ఒక దశలో ప్రతిపక్షం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్‌తో గొడవకు దిగాయి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ఆవేశంతో బల్ల చరుస్తూ సుమిత్రా మహాజన్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ తదితరులు కురియన్‌తో గొడవ పడ్డారు. కురియన్ నాలుగైదు సార్లు క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసి వస్తుందంటూ ఖాన్‌ను హెచ్చరించటం గమానార్హం. ప్రతిపక్షం అరుపులు, కూతలు, పెడబొబ్బలతో ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. ప్రతి పక్షం సభ్యుల గొడవ మధ్యలోనే ప్రభుత్వం నాలుగు బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించింది.

చిత్రం..శుక్రవారం రాజ్యసభలో సభను అడ్డుకుంటున్న ఎంపీలు