జాతీయ వార్తలు

బిజెపియేతర పార్టీలను ఏకంచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఏప్రిల్ 11: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకురావడానికి పాటుపడతానని జనతాదళ్ (యునైటెడ్) నూతన సారథి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం తెలిపారు. శరద్ యాదవ్ స్థానంలో జెడి(యు) అధ్యక్షుడిగా నితీశ్ ఎన్నికయిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేసే దిశగా తన కృషి కొనసాగుతుందని నితీశ్ వివరించారు. కొన్ని పార్టీల విలీనం, మరికొన్ని పార్టీలతో కలసి కూటమి కట్టడం, ఇంకొన్ని పార్టీలతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా వీలయినంత ఎక్కువ స్థాయిలో ఐక్యతను సాధిస్తామని ఆయన చెప్పారు. సిద్ధాంతాల సారూప్యత, పాలనకు సంబంధించి ఉమ్మడి కార్యక్రమాల ద్వారా బిజెపియేతర పార్టీల మధ్య ఐక్యతను సాధిస్తామని ఆయన వివరించారు. ఈ విశాల బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడితే 2019 ఎన్నికల్లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే సమస్యే లేదని నితీశ్ ధీమాగా చెప్పారు. అయితే ఈ ఫ్రంట్ తరపున ఏ నాయకుడినీ ముందుగానే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోమని, ఆ పదవిని నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఎవరికున్నాయనేది ప్రజలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని పదవిని నిర్వహించే సామర్థ్యం ఉందని మీరు చెప్పుకున్నారు కదా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా, ఒక ప్రశ్నకు బదులుగానే తాను ఆ విషయం చెప్పానని నితీశ్ బదులిచ్చారు. దేశంలో ఆటవిక ప్రవృత్తి గల బిజెపిని ఓడించగలమనే కొత్త ఆశాకిరణాన్ని బిహార్ ఎన్నికలు రగిలించాయని నితీశ్ కుమార్ అన్నారు. బిజెపి వ్యతిరేక ఐక్య కూటమిలో ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భాగస్వాములుగా ఉంటారా? అని ప్రశ్నించగా, లాలూ ప్రసాద్, తాను కలిసే ఉన్నామని, ములాయంకు సంబంధించి ఇంకా స్పష్టత లేదని బదులిచ్చారు.