జాతీయ వార్తలు

నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఆర్‌బిఐ ఉద్యోగుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పెద్దనోట్ల రద్దు తర్వాత రద్దయిన నోట్లకు బదులుగా కొత్త నోట్ల మార్పిడి అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంకు ఉద్యోగుల అక్రమాలు తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెంగళూరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగదు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు అధికారులను 1.99 ఓట్ల విలువైన రద్దయిన పాత నోట్లను 2వేలు, వంద రూపాయల నోట్లకు మార్పిడి చేశారన్న ఆరోపణపై శనివారం అరెస్టు చేశారు. సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద నాయక, స్పెషల్ అసిస్టెంట్ ఎకె కవిన్‌లను అనధికారికంగా నోట్ల మార్పిడికి పాల్పడినందుకు అవినీతి నిరోధక చట్టంతోపాటుగా ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు సిబిఐ తెలిపింది. ఈ ఇరువురిని బెంగళూరులోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు నాలుగు రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఈ ఇద్దరూ 1.99 కోట్ల విలువైన రద్దయిన నోట్లను తీసుకుని దానికి బదులుగా కొత్త 2 వేల రూపాయలు, వంద రూపాయల నోట్లు ఇచ్చినట్లు గుర్తించారు.