జాతీయ వార్తలు

అవినీతిపరులకే వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, డిసెంబర్ 19: పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ జరిగిన బిజెపి పరివర్తన ర్యాలీలో మాట్లాడిన మోదీ అవినీతి పరులకు ప్రతిపక్షాలు కొమ్ముకాస్తున్నాయని, నల్లధనం, అవినీతిపై చర్చకు ఆస్కారం ఇవ్వకుండా పారిపోవడం ద్వారా పార్లమెంట్ సజావుగా సాగకుండా కూడా అడ్డుకున్నాయన్నారు. ఎటిఎమ్ క్యూల్లో నిలబడ్డ వారిని రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అయినా పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని అర్థం చేసుకున్న సామాన్యుడు ఏ మాత్రం రెచ్చిపోకుండా దేశ హితాన్ని కోరి వ్యవహరిస్తున్నాడని మోదీ కితాబిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిల పక్ష భేటీలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు, రాజకీయ పార్టీల విరాళాల గురించి చర్చించాలని సూచించానని చెప్పారు. కానీ, ఈ రెండు అంశాల గురించి చర్చించడానికి ఎంత మాత్రం ఆసక్తి చూపని ప్రతిపక్ష పార్టీలు ఏకంగా పార్లమెంట్ సమావేశాలనే అడ్డుకున్నాయన్నారు.గతంలో అవినీతిని ఎండగట్టేందుకు, కుంభకోణాలను వెలుగులోకి తెచ్చేందుకు పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు అడ్డుకునేవని పేర్కొన్న మోదీ ‘ఈసారి మాత్రం అవినీతి పరులకు వంత పాడేందుకే..చర్చ నుంచి తప్పించుకోవడానికే పార్లమెంట్ సాగనివ్వలేదు’అని పేర్కొన్నారు. నల్లధనం, అవినీతి రహిత భారతావని ఆవిష్కరణే తమ ఏకైక ధ్యేయమని ఉద్ఘాటించిన మోదీ విపక్షాల అజెండా మాత్రం పార్లమెంట్‌ను అడ్డుకోవడంగానే కనిపిస్తోందన్నారు. ఈ రకమైన ధోరణి తనకు విస్మయాన్ని కలిగిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన ప్రధాని ఆ పార్టీ ద్వంద్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. తమ నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లే సామాన్యుడికి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అవే మొబైల్ ఫోన్లను బ్యాంకులుగా వాడుకోండని తాను సామాన్యులకు చెబుతూంటే అడ్డు పడుతున్నారని, అసలు పేదల వద్ద సెల్‌ఫోన్లు లేవని, అసలు బ్యాంకు ఖాతాలే లేవంటూ మెలిక పెడుతున్నారన్నారు. ఇప్పుడు పేదలు బ్యాంకుల వద్ద నగదు కోసం పడిగాపులు కాస్తున్నారంటున్నదీ కాంగ్రెస్ నాయకులేనని, ఆ విధంగా పొంతన లేని ప్రకటనలతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మోదీ విరుచుకు పడ్డారు. యూపీలోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించిన మోదీ రాష్ట్రంలో గూండాలు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసమే ప్రజలు ఓటు వేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం..సోమవారం కాన్పూర్‌లో జరిగిన పరివర్తన ర్యాలీకి వచ్చిన ప్రదాని మోదీకి స్వాగతం పలుకుతున్న
బిజెపి కార్యకర్తలు