జాతీయ వార్తలు

జయకు భారతరత్న ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. జయకు భారతరత్న ఇవ్వాలంటూ ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. నటిగా, ముఖ్యమంత్రిగా, పార్టీ సారధిగా జయలలిత ఎంతో సేవ చేశారని సెల్వం చెప్పారు. అలాగే పార్లమెంట్ ఆవరణలో జయలలిత కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇటీవల వార్థా తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకోవాలని ఆయన ప్రధానికి అందచేసిన లేఖలో పేర్కొన్నారు. కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు, కావేరి నియంత్రణ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
జయ మృతిపై న్యాయవిచారణ జరపాలి
జయలలిత మృతిపై న్యాయవిచారణ జరిపించాలని అన్నాడిఎంకె రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప డిమాండ్ చేశారు. సోమవారం ఆమె హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లో సమావేశమయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ అమ్మ జయలలిత మరణంపై అనేక అనుమానాలున్నాయని చెప్పారు. జయ చనిపోక ముందే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఎందుకు భేటీ అయ్యారని పశ్నించారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం