జాతీయ వార్తలు

వ్యూహం ఇలా అమలు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: అసదుల్లా అక్తర్ 2013 ఫిబ్రవరి 9న మధ్యాహ్నం రెండు గంటలకు మంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరాడు. ఎల్‌బి నగర్‌లోని బ్రాడ్ లాండ్ హోటల్‌లో మహ్మద్ తాహసీన్ అక్తర్‌ను కలుసుకున్నాడు. వాళ్లిద్దరూ అబ్దుల్లాపూర్‌మెట్‌కు చేరుకున్నారు. అప్పటికే తాహసీన్ అక్కడ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఫిబ్రవరి 13న అసదుల్లా తిరిగి మంగళూరుకు వెళ్లిపోయాడు. 15న వక్వాస్‌తో కలిసి అసదుల్లా పేలుడు పదార్థాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 20వ తేదీన ముగ్గురూ కలిసి మలక్‌పేట యశోద హాస్పిటల్ వద్దనున్న కిరాయికి ఇచ్చే సైకిల్ షాప్‌లో పాత సైకిల్ కొని, మలక్‌పేట రైల్వేస్టేషన్ సైకిల్ స్టాండ్‌లో పెట్టారు. అదే రోజు మధ్యాహ్నం 4 గంటలకు లక్డీకాపూల్ నుంచి మంగళూరుకు బస్సు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కొన్ని గంటల అనంతరం అసదుల్లా, తాహసీన్ కలిసి రెండు ప్రెషర్ కుక్కర్లను ఎల్‌బినగర్‌లో కొన్నారు. వీటిని పేలుడు పదార్థాలకు అమర్చారు. 21న తెల్లవారు జామున జుమ్మెరాత్ బజార్‌కు వెళ్లి మరో సైకిల్ కొన్నారు. ఈ సైకిల్‌ను కూడా మలక్‌పేట సైకిల్ స్టాండ్‌లో పెట్టారు. సాయంత్రం ఐదు గంటలకు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇంటిని ఖాళీ చేశారు. అప్పటికే పేలుడు పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. తాహసీన్, అసదుల్లా ఇద్దరు కలిసి సైకిళ్లను స్టాండ్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వారికి వక్వాస్ కలిశాడు. ఈ ముగ్గురు కలిసి వెళ్లి దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. అక్కడి నుంచి వారు లక్డీకాపూల్‌కు చేరుకొని, అక్కడి నుంచి బస్సులో మంగళూరుకు వెళ్లిపోయారు.