జాతీయ వార్తలు

సూత్రధారి రియాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: హైదరాబాద్‌లో 2013లో దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్లలో 18 మందిని, 2007 ఆగస్టులో లుంబినీ, గోకుల్ చాట్ జంట పేలుళ్ల ఘటనలో 42 మందిని పొట్టనపెట్టుకున్న రియాజ్ భత్కల్ దేశంలో 2007 నుంచి 2014 వరకు చోటు చేసుకున్న దాదాపు అన్ని పేలుళ్ల ఘటనలకు ప్రధాన సూత్రధారి అని ఎన్‌ఐఏ పోలీసులు తెలిపారు. కర్నాటకలో ఉత్తర కన్నడ ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం భత్కల్. ఈ గ్రామానికి చెందిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, యాసిన్ భత్కల్ సోదరులు ఇండియన్ ముజాహిదీన్ అనే దేశ విద్రోహక సంస్ధను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. వీరిలో రియాజ్, ఇక్బాల్ ఇప్పటికీ పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. రియాజ్ కొంతకాలంపాటు షా రియాజ్ అసమ్మద్ మహ్మద్ ఇస్మాయిల్ షాబందరి అనే పేరు మీద చలామణి అయ్యాడు. ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన రియాజ్ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కమాండర్‌గా పనిచేశాడు. ముంబాయిలో 2011 జూలై నెలలో జరిగిన పేలుళ్లకు 35 కిలోల పేలుడు పదార్ధాలు సమకూర్చాడు. హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, ఢిల్లీ వరుస పేలుళ్ల పథక రచన, నిధులను సమకూర్చినట్లు ఆధారాలతో ఎన్‌ఐఏ నిరూపించింది. రియాజ్, యాసిన్‌లు పుణెలోని కోండ్వా ప్రాంతంలో అపార్టుమెంట్‌లో అద్దెకు తీసుకుని కొంతకాలం గడిపారు. ఇక్కడినుంచే 2007కు ముందు అనేక పేలుళ్లకు కుట్రలు పన్నారు. యాహూలో పనిచేస్తున్న మన్సూర్ పీర్ బాయ్‌ను ఐఎంలో రిక్రూట్ చేసి ఆ ఉగ్రవాది ద్వారా ఐఎం లక్ష్యాలు, విధ్వంసకాండపై మీడియా ప్రకటనలు చేయించడంలో రియాజ్ ప్రధాన సూత్రధారి అని ఎన్‌ఐఏ పేర్కొంది. పోలీసు గాలింపు తీవ్రతరం కావడంతో నేపాల్ మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం కరాచీలో ఐఎస్‌ఐ సంస్ధ సమకూర్చిన విలాసవంతమైన భవనంలో ఉన్నాడని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాకిస్తాన్‌లో ఉండి రెండుసార్లు ఇక్కడి ఐదుగురు ఉగ్రవాదులకు రియాజ్ భత్కల్ నిధులు సమకూర్చాడు. రూ.1.25 లక్షలను హవాలా ద్వారా బదిలీ చేశాడు. మరో దఫా రూ.70 వేల నగదును పేలుళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇక్కడ పేలుళ్లలో పాల్గొన్న ఉగ్రవాదులకు పంపాడు. పేలుళ్లలో 50 డిటోనేటర్లను వాడాలని రియాజ్ ఆదేశించాడు.

చిత్రాలు..దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో సోమవారం ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు