జాతీయ వార్తలు

భారత్‌తో మరింత బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 22: భారతదేశం, శ్రీలంకల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని శ్రీలంక ప్రధాని రానిల్ విక్రమ్‌సింఘే అన్నారు. అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. అయితే తన తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మిక పర్యటనే అని స్పష్టం చేశారు. త్వరలో భక్తుల ముందుకు పూర్తిస్థాయిలో రానున్న ఎస్వీబీసీ తమిళ ఛానెల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరింత మంది భక్తులు శ్రీవారి సేవలు, ప్రత్యేక పూజలు, బ్రహ్మోత్సవాలను దగ్గరగా చూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్నారు. మహద్వారం వద్దకు రాగానే టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి , టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు, తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు సుచిత్రా ఎల్లా, విక్రమ సింఘే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించారు. అటు తరువాత శ్రీవారి ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, 2017 నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను ఆయనకు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావు, టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజులు అందించారు.

చిత్రం..తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వస్తున్న శ్రీలంక ప్రధాని విక్రమసింఘె దంపతులు