జాతీయ వార్తలు

ఇలా చేస్తారనుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, డిసెంబర్ 22: నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసిన ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడం కోసం కాల్పులు జరిపే పాకిస్తాన్‌లాగా వాళ్లు అవినీతిపరులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు నోట్ల రద్దు ‘కాలాధన్’ (నల్లధనం)తో పాటుగా చాలామంది ‘కాలామన్’ (దుర్బుద్ధి)ని సైతం బైటపెట్టిందన్నారు. ‘ఈ భారీ నిర్ణయం పర్యవసానాలను నేను పరిగణనలోకి తీసుకోలేదని చాలామంది అంటున్నారు. వాస్తవానికి చాలా రాజకీయ పార్టీలు, నాయకులు ఇంత నిస్సిగ్గుగా అవినీతిపరులకు అండగా నిలుస్తారని నేను ఊహించలేదు. అయితే ఈ చర్య నల్లధనాన్ని అంతం చేయడంతోపాటుగా చాలామంది దుర్బుద్ధిని బైటపెట్టినందుకు నాకు సంతోషంగా ఉంది’ అని మోదీ అన్నారు. నవంబర్ 8న వెయ్యి, 500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత గురువారం తొలిసారి తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బనారస్ హిందూ యూనివర్శిటీ క్యాంపస్‌లోపల ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ‘అవినీతిపరులకు అండగా కొందరు రాజకీయ నాయకులు ఇంత దృఢంగా నిలుస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నోట్ల రద్దుపై పార్లమెంటులో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న రభస ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్నట్లుగా ఉంది’ అని అన్నారు.
అంతేకాదు పేదరికం, నిరక్షరాస్యత, దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ చేరకపోవడం లాంటి కారణాల వల్ల నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం వృథా ప్రయాస అవుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం చేస్తున్న వాదనలను సైతం ప్రధాని తిప్పి కొట్టారు. ‘ఇది ఎవరి రిపోర్ట్ కార్డు, వాళ్లది కాదా?’ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 50 శాతం మంది నిరుపేదలని, అందువల్ల దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదని మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పడాన్ని ప్రధాని తప్పుబడుతూ, ‘ఈ దుర్భర పరిస్థితికి తన ప్రభుత్వమే కారణమని ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నారా?’ అని అన్నారు. మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధానిగా పని చేశారని, అంతకుముందు ఆర్థిక మంత్రిగా కూడా పని చేశారని మోదీ అన్నారు. 1970నుంచి ఆయన కీలక పదవుల్లో ఉన్నారన్నారు. మన్మోహన్ సింగ్ నిష్కళంకితుడే కాని, ఆయన హయాంలో భారీ స్కామ్‌లు జరిగాయన్నారు. అంతేకాదు దేశంలో సగం గ్రామాలకు విద్యుత్ లేదని, అలాంటప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలకు అంతగా ప్రోత్సాహం ఉండదన్న మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యలను సైతం మోదీ తప్పుబడుతూ ‘ఇది ఎవరి తప్పు? విద్యుత్ స్తంభాలను నేను కూల్చేశానా లేక విద్యుత్ ఉన్న గ్రామాల్లో కేబుళ్లను కట్ చేశానా?’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తనను ‘కాశీకా బచ్చా’గా చెప్పుకొన్న ప్రధాని తాను కష్టపడి పని చేసేందుకు, ప్రతిపక్షాల వాళ్లు తమ వైఫల్యాలను అయిష్టంగానైనా అంగీకరించేలా చేసే శక్తిని ఈ పవిత్ర భూమి ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు.

చిత్రం..వారణాసిలో గురువారం కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే తదితరులు