జాతీయ వార్తలు

కృష్ణా బోర్డుకు జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: వివాదాస్పదంగా మారిన కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సమర్థంగా పని చేసేందుకు అవసరమైన చర్యలు సూచించేందుకు కేంద్ర జలవనరల శాఖ మంత్రి ఉమాభారతి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షుడు ఏకె బజాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు ఎం గోపాలకృష్ణన్, ఎన్‌ఐహెచ్ రూర్కి శాస్తవ్రేత్త ఆర్‌పి పాండే, సిఈఏ చీఫ్ ఇంజనీర్ ప్రదీప్‌కుమార్ శుక్లా, కేంద్ర జల సంఘం హైడ్రాలజీ విభాగం డైరక్టర్ ఎన్‌ఎన్ రాయ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్‌ఎన్ రాయ్ సభ్య కార్యదర్శిగా పని చేస్తారు. కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డు సక్రమంగా పని చేయటం లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయటం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డు పని చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై బజాజ్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తగు సూచనలు, సిఫారసులు చేస్తుంది. కృష్ణా నదిపై ఉన్న రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టుల ఆపరేటింగ్ రూల్స్, ప్రొసీజర్లకు సంబంధించిన మాన్యువల్‌ను తయారు చేయటం, గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న గోదావరి జలాల కేటాయింపు ఎలా ఉండాలనేది ఈ ప్రత్యేక కమిటీ సూచించవలసి ఉంటుంది. బజాజ్ కమిటీ తన నివేదికను తొంబై రోజుల్లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అందజేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈప్రత్యేక కమిటీకి అవసరమైన ఏర్పాట్లు చేయటంతోపాటు సంపూర్ణ సమాచారాన్ని అందజేయవలసి ఉంటుంది. కేంద్ర జల సంఘం నుండి సమాచారంతోపాటు ఇతర సహాయ, సహకారాలను తీసుకునే వీలును ప్రత్యేక కమిటీకి కల్పించారు.