జాతీయ వార్తలు

శంఖఘోష్‌కు జ్ఞానపీఠ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రముఖ ఆధునిక బెంగాలీ కవి శంఖ ఘోష్‌ను 2016 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు జ్ఞానపీఠ్ సంస్థ ప్రకటించింది. జ్ఞానపీఠ్ సెలెక్షన్ బోర్డు ఈ రోజు జరిగిన ఒక సమావేశంలో 52వ జ్ఞానపీఠ్ అవార్డును అందుకునే వ్యక్తి పేరును ప్రకటించింది. ప్రముఖ ఆధునిక బెంగాలీ కవి శంఖ ఘోష్‌కు ఈ అవార్డు లభించింది’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. సెలెక్షన్ బోర్డు సమావేశానికి ప్రముఖ రచయిన విద్యావేత్త నమ్వార్ సింగ్ అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, విమర్శ, విద్యావేత్త అయిన ఘోష్‌కు నోబెల్ పురస్కార గ్రహీత అయిన రవీంద్రనాథ్ టాగోర్‌పై మంచి పట్టు ఉంది. ఆయన కవితలు ప్రతిదానిలోను ఏదో ఒక సందేశం ఇమిడి ఉంటుంది. 1932లో జన్మించిన ఘోష్ అదిమ్ లతా గుల్మొమయ్, ముర్ఖా బారో, సామాజిక్ నాయ్, కబీర్ అభిప్రాయ్, ముఖ్ దేఖే జాయ్ బిగ్యాపనే, బబరేర్ ప్రార్థనలాంటి అనేక కవితలు రాశారు. ముఖ్యంగా దిన్‌గులీ రాత్ గులీ,నిహిత పటల్‌ఛాయ కవితల్లోని ఆయన ప్రత్యేకమైన బాణి, భావాలు ఆధునిక కవిత్వానికి చెందిన మొత్తం తరానికే స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన రచనలు హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, మలయాళం లాంటి పలు భారతీయ భాషలతో పాటుగా కొన్ని విదేశీ భాషల్లోకి సైతం అనువదించబడ్డాయి. ఘోష్ సాహిత్య అకాడమీ అవార్డు, నర్సింగ్ దాస్ పురస్కార్, సరస్వతీ సమ్మాన్, రబీంద్ర పురస్కార్ సహా పలు పురస్కారాలను అందుకున్నారు. గత ఏడాది గుజరాత్ రచయిత రఘువీర్‌దాస్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద నగదు పురస్కారంతో పాటుగా, ప్రశంసాపత్రం, సరస్వతీ దేవి కాంస్య ప్రతిమను అందజేస్తారు.