జాతీయ వార్తలు

‘డెడ్’లైనేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశంలో కరెన్సీ కొరత-సరఫరా మధ్య ఏకోశానా పొంతన కుదరడం లేదు. ఈ నెల 30లోగా కరెన్సీ కష్టాలు తీరే అవకాశం కనిపించడం లేదు. అంటే కొత్త ఏడాదిలోనూ ఇటు బ్యాంకులు అటు ఎటిఎమ్‌లలో కరెన్సీ రేషనింగ్ అనివార్యమన్న వాస్తవం డెడ్‌లైన్ సమీపించే కొద్దీ స్పష్టమవుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణ యం నేపథ్యంలో 50రోజుల్లో కొత్త కరెన్సీ కష్టాలు తీరిపోతాయని ప్రధాని మోదీ హామీ ఇచ్చా రు. ఆ గడువుమరో నాలుగురోజుల్లో పూర్తికాబోతోంది. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల కొత్త ఏడాదిలోనూ కరెన్సీ ఆంక్షలు కొనసాగడం అనివార్యమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల వారానికి 24వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. తమకు రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చిన నగదును దృష్టిలో పెట్టుకునే కష్టమర్లకు బ్యాంకులు కరెన్సీని సరఫరా చేస్తూ వచ్చాయి. కొత్త ఏడాదిలో 24వేల నగదు పరిమితిని తొలగిస్తే ఆ డిమాండ్‌ను బ్యాంకులు తట్టుకోవడం కష్టమని చెబుతున్నారు. అంటే తగిన పరిమాణంలో నగదును అందుబాటులోకి తేకుండా 24వేల పరిమితిని ఎత్తివేస్తే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అంటే వారంలో 24వేల రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి కొత్త ఏడాదిలోనూ తప్పదని తేలిపోతోంది. బ్యాంకుల నుంచి నగదును తీసుకునే పరిమితిని పూర్తిగా ఎత్తివేయక పోవచ్చునని..కరెన్సీ లభ్యతను బట్టి దీన్ని క్రమంగా పెంచే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. సాధారణ వినియోగదారుల కరెన్సీ అవసరాలే తీర్చలేని పరిస్థితుల్లో పెద్ద కార్పొరేట్ సంస్థల డిమాండ్‌ను తట్టుకునే అవకాశం ఎంత మాత్రం ఉండదని వెల్లడించాయి. ఒక్కసారిగా కరెన్సీ పరిమితిని ఎత్తివేయకుండా క్రమంగా దాన్ని పెంచడమొక్కటే ఏకైక మార్గంగా కనిపిస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయ పడ్డారు.