జాతీయ వార్తలు

రాజకీయాల్లో చేరడానికి ఎలాంటి విముఖత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడయిన రాబర్ట్ వాద్రా తనకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి విముఖత లేదని గురువారం సూచనప్రాయంగా చెప్పారు. ప్రజలకోసం పనిచేయాలని తాను భావించినప్పుడు, అందుకు సంబంధించిన అవకాశాలు కూడా తలుపుతట్టినప్పుడు ఎవరూ కూడా వాటిని కాదనలేరని వాద్రా తెలిపారు. అయితే తన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు. వాద్రా హర్యానాలో రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్‌ఎఫ్‌తో జరిపిన భూలావాదేవీలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ, ఇతర ఒత్తిడులను తట్టుకొని నిలబడే శక్తి తనకుందని, ఎందుకంటే తనకు తన కుటుంబం నుంచి గట్టి మద్దతు ఉందని వాద్రా తెలిపారు. అయితే జీవితంలో ఎదగడానికి తనకు తన భార్య ప్రియాంక అవసరం లేదని, ఎదగడానికి అవసరమైన స్థితి తనకు ఎప్పుడూ ఉందని, తన నాన్న తనకు తగినంత ఇచ్చారని వాద్రా అన్నారు. తాను విద్యావంతుడిని అయినందున అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగలనని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన గురించి వాద్రా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వంటి వ్యాపార రంగంలో అనేకమంది అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారంతా తమ గొంతు విప్పుతారని అన్నారు. ప్రజలు ఏది మంచి, ఏది చెడు అనేది అర్థం చేసుకొని, త్వరలోనే తిరుగబడతారని ఆయన పేర్కొన్నారు.