జాతీయ వార్తలు

మోదీ, బాబు చరిత్రలో నిలిచిపోతారు: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలవరం నిర్మాణానికి నాబార్డు రుణాన్ని చెక్కు రూపంలో కేంద్రమంత్రి ఆరుణ్‌జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య పోలవరం ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తిచేస్తామని చంద్రబాబు చెప్పడం మంచి పరిణామమన్నారు. పోలవరం విషయంలో అరుణ్‌జైట్లీ పార్లమెంట్ బయట లోపలా తన వెంట నిలిచారన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవన రేఖ అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ పాజెక్టుగా ప్రకటిస్తూ సంబంధించిన అనుమతులను మంజూరు చేశామన్నారు. అలాగే ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైయ్యే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ చట్టం చేశామన్నారు.