జాతీయ వార్తలు

దేశానికి చౌకీదార్‌ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, డిసెంబర్ 27: ‘నేను ఒక చౌకీదార్ (కాపలాదారు)గా పనిచేస్తున్నా. నల్లధనం, అవినీతి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు నా విధి నేను నిర్వర్తిస్తున్నా. నా పని నేను చేసుకుపోతుంటే, గిట్టని వాళ్లు అడ్డుపడుతున్నారు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై తాను తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఉగ్రవాదులకు నిధుల సరఫరా పూర్తిగా ఆగిపోయిందన్నారు. తన ప్రభుత్వం పూర్తిగా పేదల అభ్యున్నతి కోసమే పనిచేస్తోందని, ఈ లక్ష్యాన్ని సాధించే దిశలోనే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు మోదీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు కారణంగా ఉగ్రవాదులకు నిధులు ఆగిపోవటమే కాకుండా మానవ అక్రమ రవాణాకు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు చెక్ పడిందని ఆయన అన్నారు. డెహ్రాడూన్‌లో మంగళవారం జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీ సభలో మోదీ మాట్లాడారు. పెద్ద పెద్ద కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించటం కోసమే తాను పనిచేస్తున్నానంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన నిర్ణయం వల్ల చోరోంకా సర్దార్ (దొంగల నాయకుడు)కి అడ్డుకట్ట పడటం కొందరికి నచ్చటం లేదంటూ విపక్షాలపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రస్తావిస్తూ తాను అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బీరువాల్లో, పరుపుల కింద దాచుకున్న డబ్బులన్నీ బ్యాంకులకు, ప్రజలకు చేరుతున్నాయి. ‘నేను ఒక చౌకీదార్‌గా నల్లధనం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. కొందరికి రక్తంలోనే అవినీతి ఉంది. వాళ్లు దొడ్డిదారిన నగదు మార్పిడికి ప్రయత్నించారు. మోదీ తమను చూడరని వారనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు దొరికిపోతున్నారు’ అని ప్రధాని అన్నారు. నోట్ల రద్దు అంశంలో తనకు దన్నుగా నిలిచిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘అవినీతిపై పోరాటం చేయటం కోసం మీరు నాకు ఓటు వేస్తారా లేదా? అవినీతి భూతాన్ని మనం తరిమి కొడదామా లేదా’ అని మోదీ ప్రజలను ప్రశ్నించారు.

చిత్రం..మంగళవారం డెహ్రాడూన్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్