జాతీయ వార్తలు

మన తీరాలకు తిరుగేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 14: దేశంలోని నదీ తీరప్రాంత రేవులను అభివృద్ధి చేయడానికి లక్ష కోట్ల రూపాయలమేర పెట్టుబడులు సేకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ ప్రకటించారు. దేశంలోని 7,500 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని ప్రగతి ఇంజన్‌గా మారుస్తామని వెల్లడించారు. సురక్షితంగా, భద్రతాయుతంగా సంతృప్తికరంగా ఈ తీర ప్రాంతాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. మారిటైం ఇండియా శిఖరాగ్ర సదస్సును గురువారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోదీ 2020-25 నాటికి భారత తీరప్రాంత సామర్ధ్యాన్ని మూడు బిలియన్ టన్నులకు పెంచుతామని స్పష్టం చేశారు. భారత్ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం ఉందని ఇందుకు సముద్ర మార్గాలు కూడా అన్ని విధాలుగా సురక్షితమని మోదీ తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీరప్రాంతాలు, నౌకారంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని భవిష్యత్‌లో అన్ని విధాలుగా తీరప్రాంతాలను అభివృద్ధి చోదక ఇంజన్లుగా మారుస్తామని వెల్లడించారు. సముద్ర వాణిజ్యం ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున మరో ఐదు రేవుపట్టణాలను కూడా నిర్మించబోతున్నామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగానికి తగ్గట్టుగా వీటిని అభివృద్ధి చేస్తామన్నారు. అనేక తీరప్రాంత రాష్ట్రాలే ఈ రేవులను నిర్మిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని రేవుల సామర్థ్యాన్ని 1400 మిలియన్ టన్నుల నుంచి 3000 మిలియన్ టన్నులకు పెంచాలన్న లక్ష్యంలో భాగంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరిస్తున్నామని వెల్లడించారు. భారత దేశ తీరప్రాంత వాణిజ్యానికి ఘనమైన చరిత్ర ఉందని దీనికి అద్భుత భవితను అందించాలన్నదే తమ ఆశయమని అన్నారు. విదేశాల నుంచి భారత తీరాలకు వచ్చే నౌకల రక్షణకు తిరుగుండదని పేర్కొన్న మోదీ4వ్యక్తిగతం నేను ఇనె్వస్టర్లకు ఈ హామీ ఇస్తున్నాను2అన్నారు.