జాతీయ వార్తలు

తెరవెనుక రాజకీయాల నుంచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 29: ఎల్లవేళలా జయలలితకు నీడలా ఆమె వెన్నంటి ఉంటూ తెరవెనుక రాజకీయాలు నడపటం మినహా ఎన్నడూ బహిరంగంగా ప్రజాజీవితంలోకి రాని వికె శశికళ గురువారం జయలలిత రాజకీయ వారసురాలిగా ఆవిర్భవించారు. తమిళనాడులో అధికార పార్టీ అయిన ఎఐఎడిఎంకె పార్టీని ముందుకు నడిపించనున్నారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎల్లవేళలా ప్రజాకర్షక నాయకురాలిగా ఉన్న జయలలిత స్థానంలో ఎప్పుడూ బహిరంగ రాజకీయాల్లో కనిపించని శశికళ ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత్రి అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితం కావడానికి ముందు వీడియో లైబ్రరీ యజమానిగా ఉన్న 60 ఏళ్ల శశికళ ఇప్పటి వరకు తెరవెనుక రాజకీయాలు నడిపేవారని, కీలక నిర్ణయాలలోనూ జోక్యం చేసుకునేవారని ఆ పార్టీ వర్గాలు ఈ మధ్య కాలంలో వెల్లడించాయి.
అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు అరెస్టయిన శశికళ అమ్మతో పాటే జైలు జీవితం గడిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంపై అయిదేళ్ల క్రితం శశికళను పార్టీ నుంచి బహిష్కరించినా తిరిగి కొన్ని నెలలకే తిరిగి తీసుకున్నారు. సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రి పాలయినప్పటి నుంచి డిసెంబర్ 5న ఆమె కన్నుమూసే వరకు ఆమె పక్కనే శశికళ ఉన్నారు. పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసమైన వేద నిలయంలోనే ఆమెతో పాటు శశికళ నివసిస్తూ వచ్చారు. భర్త ఎం.నటరాజన్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా ఆమె భర్త వెంట వెళ్లకుండా జయలలితతోనే ఉన్నారు. ఆసుపత్రిలో జయలలితను కలవడానికి ఆమె బంధువులను కూడా అనుమతించ లేదన్న ఆరోపణలు శశికళపై ఉన్నాయి. తమిళనాట ప్రాబల్యం గల తేవర్ కులానికి చెందిన శశికళ అదే కులానికి చెందిన ఒ.పన్నీర్ సెల్వం మధ్య మధ్యలో ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారనే భావన ఉంది. జయలలిత సిఎం పదవి నుంచి దిగవలసిన పరిస్థితి వచ్చినప్పుడల్లా పన్నీర్ సెల్వం ఆ పదవిని చేపట్టి, తిరిగి జయలలిత రాగానే రాజీనామా చేస్తూ వచ్చారు. చివరికి జయలలిత అస్తమించడంతో ఆయన సిఎం పదవి చేపట్టారు. 1982లో కడలూరులో జయలలిత నిర్వహించిన పార్టీ సదస్సును వీడియో తీయడానికి శశికళ, తన భర్త నటరాజన్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా జయలలిత దృష్టిని ఆకర్షించిన శశికళ క్రమంగా ఆమెకు చేరువై పార్టీ కార్యకర్తలంతా ‘చిన్నమ్మ’గా పిలుచుకునే స్థాయికి ఎదిగారు. శశికళ తనకు ‘సరొగేట్ సిస్టర్’ అని జయలలిత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.