జాతీయ వార్తలు

మూఢ దేశ భక్తి సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 29: విభేదించే, వివాదించే, సందేహించే స్వేచ్ఛను పరిరక్షించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసినంతమాత్రాన ఆగ్రహించడం అన్నది దురదృష్టకర పరిణామమని ఆయన విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు తన వాదనను సమర్థించుకోవడం కోసం చరిత్రను వక్రీకరించడం, లేదా వాస్తవంతో రాజీపడే ధోరణులు దేశ భక్తి అనిపించుకోదని కూడా ఆయన స్పష్టం చేశారు. భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు.. ఇలా భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలమని ఆయన అంటూ, వాదించే తత్వం కలిగిన భారతీయుడివల్లే తప్ప అసహన భారతీయుడి వల్ల దేశ సంస్కృతులు రాణించలేదని కూడా గుర్తుంచుకోవాలని అన్నారు. గురువారం ఇక్కడ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 77వ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేశారు.
గతానికి చెందిన లేదా ఇప్పటి మన సామాజిక, సాంస్కృతిక వ్యవస్థల పట్ల ఏదయినా ప్రతికూల అభిప్రాయం వ్యక్తమయినప్పుడు ఆగ్రహానికి గురికావడం అనే దురదృష్టకరమైన ధోరణి దేశంలో తరచూ తలెత్తుతోందని ఆయన అన్నారు. అలాగే దేశ నాయకులు, హీరోల పట్ల విమర్శిస్తూ ఏదయినా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆగ్రహం వ్యక్తం కావడం, ఒక్కోసారి హింసకు దారితీయడం జరుగుతోందని కూడా ఆయన అన్నారు. మేధోపరంగా విభేదించే, వివాదించే, సందేహించే స్వేచ్ఛను ప్రజాస్వామ్యపు మూలస్తంభాల్లో ఒకటిగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఏ రంగంలోనైనా ముఖ్యంగా చరిత్రలాంటి కళలో పురోగతికి అలాంటి స్వేచ్ఛ చాలా ముఖ్యమని కూడా ఆయన అన్నారు. కాగా, చరిత్ర విషయంలో వీలయినంతవరకు వాస్తవ దృక్పథంతో ఉండాలని తన ప్రసంగంలో రాష్టప్రతి చరిత్రకారులను కోరారు. ‘ప్రతి ఒక్కరూ తమ దేశాన్ని ప్రేమించడం, దాని ఘనమైన చరిత్రను గొప్పగా భావించడం సహజం. అయితే తమ వాదనను సమర్థించుకోవడం కోసం చరిత్రను వక్రీకరించడం, లేదా వాస్తవం విషయంలో రాజీపడడం లాంటి సంకుచిత ధోరణలు దేశ భక్తి అనిపించుకోవు’ అని రాష్టప్రతి అన్నారు. ఏ సమాజం కూడా పర్‌ఫెక్ట్ కాదని, ఎక్కడ తప్పు జరిగింది, గతంలో జరిగిన లోపాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోవడానికి చరిత్ర ఒక దిక్సూచిగా తోడ్పడుతుందని ప్రణబ్ అన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి అనుగుణంగా ఉండడం కోసం కొన్ని స్వార్థపరశక్తులు చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేశ్ చెన్నితల విమర్శించారు. ఈ సందర్భంగా రాష్టప్రతి హిస్టరీ కాంగ్రెస్ కార్యకలాపాలకు సంబంధించిన తొలి కాపీని ముఖ్యమంత్రికి అందజేసి ఆవిష్కరించారు.

చిత్రం..గురువారం తిరువనంతపురంలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 77వ సమావేశాలను ప్రారంభించిన అనంతరం రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీతో కరచాలనం చేస్తున్న కేరళ సిఎం పి.విజయన్